వైఎస్ జగన్ పాదయాత్రలో మరో మైలు రాయి
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజైన నేడు 1000 కి.మీ పూర్తిచేసుకుంది.
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజైన నేడు 1000 కి.మీ పూర్తిచేసుకుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సుమారు 3000 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని నవంబర్ 6వ తేదిన ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం సైదాపురం వద్ద1000 కి.మీ మైలురాయిని చేరుకుంది. టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులనే వేలెత్తి చూపిస్తూ, తాను అధికారంలోకొచ్చాకా ఆ సమస్యలకి పరిష్కారం చూపిస్తానని హామీలు ఇస్తూ వెళ్తున్న జగన్ పాదయాత్రకు పలుచోట్ల విశేష స్పందన కనిపిస్తోంది.
సోమవారం ఉదయం 8 గంటలకు గూడురు శివార్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్.. గోగినేనిపురం, చెన్నూరు, వెంకటగిరి క్రాస్, సైదాపురంల మీదుగా కొనసాగింది.