Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ
Sharmila Kadapa Tour: రాజకీయంగా వైఎస్ షర్మిల సరికొత్తగా పావులు కదుపుతున్నారు. తన సోదరుడు, సీఎం జగనే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా సొంత జిల్లా కడపలో షర్మిల పర్యటించడంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి.
Kadapa Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించి సంచలనం రేపిన వైఎస్ షర్మిల రాజకీయంగా దూకుడుగా ఉన్నారు. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జోష్ తీసుకొస్తూనే వైఎస్ కుటుంబంలో చిచ్చు రేపుతున్నారు. సీఎం, సోదరుడైన జగన్‌కు వ్యతిరేకంగా స్కెచ్ గీస్తున్న షర్మిల తాజాగా దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డితో షర్మిల సమావేశం కావడం మరింత ఆసక్తికరంగా మారింది.
జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల తన సొంత జిల్లా కడపలో కూడా పర్యటించారు. ఈ క్రమంలో సోమవారం ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. అనంతరం తన బాబాయి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డితో షర్మిల సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు సునీతతో షర్మిల సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చర్చ జరుగుతోంది.
వీరి సమావేశంలో బాబాయి హత్యోదంతంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు జరిగిన పరిణామాలు, అంతకుముందు ఉన్న జరిగిన సంఘటనలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. వివేకా హత్య కేసును నిష్పాక్షికంగా విచారణ చేయాలని సునీత మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. సీబీఐ విచారణ కోరడం, న్యాయస్థానాలు మారడం వంటివి సునీతా చేశారు. తండ్రి మరణానికి న్యాయం జరగాలని సునీత పోరాటం చేస్తుండగా.. వాటి విషయాలను షర్మిల ఆరా తీసినట్లు చర్చ జరుగుతోంది.
ఈ హత్యకు తన సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డి కారణమని సునీత బలంగా నమ్ముతోంది. ఇదే విషయాన్ని షర్మిలకు కూడా సునీత చెప్పినట్లు తెలుస్తోంది. ఈ హత్యపై న్యాయం పోరాటం చేస్తున్న సునీతను షర్మిల రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు సమాచారం. న్యాయ పోరాటం మాదిరి రాజకీయాల్లో ఉండి పోరాటం చేయాలని షర్మిల సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జిల్లాలో తన సోదరుడు జగనన్నకు వ్యతిరేకంగా షర్మిల వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సునీతతో సమావేశయ్యారు. ఇక ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీఎల్ రవీందర్‌తో కూడా షర్మిల భేటీ అయ్యారు. ఖాజీపేటలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లి షర్మిల కలిశారు.
ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న డీఎల్‌ను ఇప్పుడు మళ్లీ పని చేయాలని షర్మిల సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి షర్మిల ఆహ్వానంపై డీఎల్ ఎలా స్పందిస్తారో చూడాలి. సునీత, డీఎల్‌తో సమావేశాలు కడప జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై షర్మిల దృష్టి సారించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. జగనన్నే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు. మరి కడప జిల్లా రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయో చూడాలి.
Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్ లేదబ్బా
Also Read: Bottole Thrash: 'బాటిల్' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి