YS Sharmila Fires on Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉందని.. జగన్ రూ2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా..? అంటూ ఎద్దేవా చేశారు. అదానీ వద్ద గుజరాత్ యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొందని.. అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి రూ.2.49 పైసలకు కొన్నందుకు సన్మానాలు చేయాలా..? అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా..? అని ప్రశ్నలతో కౌంటర్ ఇస్తూ ఆటాడుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mokshagna: ఎట్టకేలకు మొదలైన నందమూరి మోక్షజ్ఞ మూవీ.. కిర్రాక్ పుట్టిస్తున్న లుక్..


ట్రాన్స్‌మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే .. గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదు..? వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూ.2.49 రేటుకు ఎందుకు ఒప్పుకున్నారు..? అని నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని అడిగారు. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీతో ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అంటూ కౌంటర్ ఇచ్చారు. రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం కూడా చరిత్రేనంటూ విమర్శించారు. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్రగా మిగిలిపోతుందని అన్నారు.


అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లో తన పేరు లేదని జగన్ బుకాయిస్తున్నారని.. ఆనాడు ఏపీ సీఎం మీరు కదా..? అని షర్మిల అడిగారు. మీరు అవినీతికి పాల్పడ్డారని అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని.. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ.1750 కోట్లు ఏపీ సీఎంకు ఇచ్చారని స్పష్టం చేశాయన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్ చేసుకుని రూ.35 వేల కోట్ల భారం వేసిందని జగన్ చెబుతున్నాని.. మరీ అధికారంలోకి వచ్చాక  గాడిదలు కాశారా..? అంటూ ఫైర్ అయ్యారు. టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారు..? అని నిలదీశారు. 


గంగవరం పోర్టును అడ్డికి పావుసేరు లెక్కన రూ.640 కోట్లకే అమ్మినప్పుడే ముడుపుల బంధం ఏపాటితో తెలిసిపోయిందన్నారు వైఎస్ షర్మిల. అదానీతో రహాస్య ఒప్పందాలు జరగకుంటే.. అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే.. మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి ఈ సవాల్‌ను స్వీకరించాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.


Also Read: New Small Business Idea: 35 సంవత్సరాల వరకు లాభాలే లాభాలు.. ఈ పండ్లతో నెలకు లక్షల్లో ఆదాయం.. డోంట్‌ మిస్‌ గురూ..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter