New Small Business Idea: 35 సంవత్సరాల వరకు లాభాలే లాభాలు.. ఈ పండ్లతో నెలకు లక్షల్లో ఆదాయం.. డోంట్‌ మిస్‌ గురూ..

Black Guava Small Business Idea: బిజినెస్ అనేది కేవలం చదువుకున్నవారికే పరిమితమైనది కాదు. ప్రతి ఒక్కరిలోనూ వ్యాపారవేత్త ఉంటాడు కానీ అందరూ దాన్ని బయటకు తెచ్చుకోలేరు. ఒక బిజినెస్‌ని ప్రారంభించడానికి ఐడియా ఉండటం చాలా ముఖ్యం, కానీ అది మాత్రమే సరిపోదు. బిజినెస్‌ని నడిపించడానికి కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం.  ఏదైనా రంగంలో అనుభవం ఉంటే, ఆ రంగంలో బిజినెస్‌ని ప్రారంభించడం సులభం. ఈరోజు నల్ల జామకాయ పంటతో రైతులు చిన్న వ్యాపారం ఎలా ప్రారంభించవచ్చు అనేది తెలుసుకుందాం. 
 

1 /6

ప్రస్తుతం మార్కెట్‌లో రంగురంగుల పండ్లు, కూరగాయలు దర్శనం ఇస్తున్నాయి. ఇవి చూడడానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా  మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

2 /6

సోషల్ మీడియాలో ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన పెరగడంతో ప్రజలు రంగురంగుల పండ్లు, కూరగాయలను తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ రంగురంగుల ఆహారం తినడం ఒక ఫ్యాషన్‌గా మారింది.

3 /6

మీరు వ్యవసాయం చేస్తున్నారా? లేదా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నవారు అయితే ఈ బిజినెస్‌ ఐడియా మీరు బోలెడు డబ్బును తీసుకురావడం ఖాయం. దీని కోసం మీరు భారీగా పెట్టుబడి పట్టాల్సి అవసరం లేదు.   

4 /6

మార్కెట్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వంటి జామపండ్లు మనం కొనుగోలు చేస్తాము. కానీ మీరు ఎప్పుడైనా నల్ల జామపండను చూశారా? ఈ పండు చూడడానికి నల్లగా ఉంటుంది. పండు లోపల ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. 

5 /6

నల్లజామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది బరువు నియంత్రించడంలో, డయాబెటిస కంట్రోల్‌ చేస్తుందని చెబుతున్నారు. ఇందలో ఉండే ఆరోగ్యకరమైన పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయి. 

6 /6

ఇప్పటికే నల్ల జామకాయలను హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారాని సమాచారం. ఒక నల్ల జామకాయం బరువు 100 గ్రాములు ఉంటుంది. వీటిని సాగు చేయడం కష్టమైన పని కాదు. సులభంగా సాగు చేస్తూ నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చు.