Viveka Letter Judgement: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో రెండ్రోజుల్లో అత్యంత కీలకమైన నిర్ణయం వెలువడవచ్చు. వివేకా హత్యకేసు నిగ్గు తేల్చేందుకు ఉపయోగపడే ఈ ప్రక్రియపై కోర్టు నిర్ణయం కోసం సీబీఐ ఎదురుచూస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా హత్య కేసుల కీలకంగా భావిస్తున్న సంఘటనా స్థలంలో లభించిన లేఖ మరోసారి చర్చల్లోకొచ్చింది. ఈ లేఖలో డ్రైవర్ ప్రసాద్ తన హత్యకు కారణమని, వదిలి పెట్టవద్దని చనిపోయేముందు రాసినట్టుగా ఉంది. ఈ లేఖను నిజంగానే వివేకానందరెడ్డి రాశారా లేదా బలవంతంగా రాయించారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ లేఖను పరీక్షించిన సీఎఫ్ఎస్ఎల్ బలవంతంగా రాసినట్టుగా ధృవీకరించింది. ఈ క్రమంలో ఈ లేఖపై ఇంకెవరివైనా వేలి ముద్రలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కీలకంగా మారింది. అందుకే నిన్‌హైడ్రిన్ పరీక్షకు సిద్ధమైంది సీబీఐ. 


నిన్‌హైడ్రిన్ పరీక్ష అంటే ఎలా ఉంటుంది


నిన్‌హైడ్రిన్ పరీక్ష నేర పరిశోధనకు ఉపకరించే కొత్త ప్రక్రియ. ఈ పరీక్ష నిర్వహించడం ద్వారా వివేకా చేతిరాతతో పాటు కంటికి కన్పించని, సాధారణ పరీక్షల్లో బయటపడని వేలి ముద్రలు సైతం గుర్తించవచ్చు. అయితే ఈ పరీక్ష చేయాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఎందుకంటే ఈ పరీక్ష నిర్వహించినప్పుడు కాగితంపై ఉన్న ఇంకు చెరిగిపోయే అవకాశాలు ఎక్కువ. అంటే ఆ లేఖ ఇకపై ఏముందో ఇకపై కన్పించకపోవచ్చు. అందుకే ఈ ప్రక్రియ ముందుకు సాగాలంటే న్యాయస్థానం అనుమతితో చేయాల్సి ఉంటుంది. 


Also read: AP govt Employees: ఉద్యోగుల డిమాండ్లలో ప్రభుత్వం అంగీకరించినవి ఏంటంటే..


ఈ లేఖ పరీక్ష చేసేముందు ఆ లేఖ కలర్ జిరాక్స్ రికార్డుల్లో భద్రపర్చాలని సీబీఐ తెలిపింది. అయితే దీనికి నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ పిటీషన్ కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 7వ తేదీ అంటే రేపు ఈ లేఖను నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలా లేదా అనేది తేల్చనుంది. కానీ తాజాగా ఈ ప్రక్రియలో సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తమ న్యాయవాదులు సహకరించేలా అనుమతివ్వాలని సునీత పిటీషన్ దాఖలు చేయడంతో 8వ తేదీన తీర్పు వెలువడనుంది.


Also read: Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెగ్యూలరైజ్‌కు గ్రీన్ సిగ్నల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook