AP govt Employees: ఉద్యోగుల డిమాండ్లలో ప్రభుత్వం అంగీకరించినవి ఏంటంటే..

AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2023, 04:35 AM IST
AP govt Employees: ఉద్యోగుల డిమాండ్లలో ప్రభుత్వం అంగీకరించినవి ఏంటంటే..

AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు. 1.7.2018 , అలాగే 1.1.2019 రెండు డిఎల అరియర్స్ కి సంబంధించిన డబ్బులతో పాటు సరెండర్ లీవులు డబ్బులను కలిపి మొత్తం అమౌంట్ ని సెప్టెంబర్ - 2023 లోపు  చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 

మరో రెండు డిఎలు 1.7.2019 , 1.7.2021 కలిపి + పిఆర్శీ అరియర్స్ అన్నీ కలిపి గతంలో రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా నేటి చర్చల్లో ప్రభుత్వం పక్షాన ఆ మొత్తాన్ని 10 సంవత్సరాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనకు తాము ఒప్పుకొనందున, చివరకు మొత్తం పిఆర్సీతో పాటు ఆ 2 డీఏ అరియర్స్ కలిపి సుమారు 7,370 కోట్లు రూపాయలను జనవరి - 2024 నుండి సంవత్సరానికి 4 వాయిదాలు చొప్పున పదహారు వాయిదాలలో.. అంటే మొత్తం నాలుగు సంవత్సరాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసిందని.. అందుకు తాము కూడా అంగీకరించాం అని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టంచేశారు. 
 
అలాగే రాష్ట్ర విభజన నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా 5 సంవత్సారాల సర్వీస్ పూర్తయి, ఇప్పటికి కూడా ఆన్‌రోల్‌లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్ధీకరిస్తూ 7వ తేదీ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని,  త్వరలో డిపార్ట్‌మెంట్ వారిగా గైడ్‌లెన్సు ఇచ్ఛి  క్రమబద్దికరణ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. దీనివలన సుమారు 7 వేలు మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు లబ్ది పొందే అవకాశం ఉంది. స్పేషల్ పే ఇచ్ఛేందుకు అంగీకరించడంతో పాటు 12వ పిఆర్సీ కమీషనర్ ను నియమిస్తూ ఈ నెల 7వ తేదీన జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సిపియస్‌పై అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా స్పష్టత ఇస్తూ ఈనెల 7వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీలో చర్చించి మెరుగైన పింఛను విధానం ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసిందన్నారు. 

ఇది కూడా చదవండి : Ganta Narahari Prifile: రాజంపేటలో రసవత్తరంగా నడుస్తున్న రాజకీయం

మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకు ఇస్తోన్న 180 రోజుల మెటర్నరటీ సెలవులను ఆన్ డ్యూటీగా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టుగా తెలిపారు. సిపియస్ ఉద్యోగులపై పెట్టిన కేసులను సైతం ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలోకి తీసుకొస్తేనే తాము ఏదైనా నిర్ణయం తీసుకోగలం అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 8వ తేదీన గుంటూరులో జరగనున్న 4వ ప్రాంతీయ సదస్సులో అన్నీ జిల్లాల చైర్మన్లతో సమావేశమైన తరువాతే ఉద్యమంపై తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. 

ఇది కూడా చదవండి : AP EAMCET Result 2023 Date: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News