YS Avinashreddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసినా..ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ నేపధ్యంలో కోర్టు ఆదేశాల మేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది సీబీఐ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో ఇప్పటికే తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో అవినాష్ రెడ్డికి విచారణకు పిలవడంతో..ఈసారి అతని అరెస్టు తప్పదనే వార్తలు ఆందోళన రేపాయి. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటీషన్‌పై విచారణ మద్యాహ్నం ప్రారంభమైంది. అదే సమయంలో సీబీఐ విచారణకు హాజరుకావల్సి ఉండగా..కోర్టులో విచారణ నేపధ్యంలో సాయంత్రం 5 గంటల వరకూ ఆగాలని కోర్టు ఆదేశించింది. అందుకు సీబీఐ కూడా సమ్మతించింది. సాయంత్రం 5 గంటలకు ముందస్తు బెయిల్ విచారణ తరువాత విచారిస్తామని చెప్పింది.


ఈలోగా విచారణకు రేపు ఉదయం హాజరుకావాలని సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. దాంతో ఇవాళ్టి విచారణ వాయిదా పడటంతో సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డి వెనక్కి వచ్చేశారు. 


దూకుడు పెంచిన సీబీఐ


వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు అక్షింతలు, దర్యాప్తు అధికారి రాంసింగ్ తొలగింపు అనంతరం సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో దూకుడు పెంచింది. రెండ్రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ..ఇవాళ ఊహించని రీతిలో ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 


ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. సోమవారం మద్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావల్సిందిగా కోరింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన రోజే అవినాష్ రెడ్డికి సైతం నోటీసులు అందడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ కేసులో అవినాష్ రెడ్డి ఒక్కరే మిగిలారు. రేపటి విచారణ అనంతరం అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు.


Also read: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. వారితో అక్రమ సంబంధాలు ఉన్నాయి: ఎంపీ అవినాష్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook