Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుకు బ్రేక్ పడటంతో కేసు విచారణపై ఆసక్తి కలుగుతోంది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సీబీఐ తదుపరి చర్య ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఇవాళ ఈ కేసుకు సంబంధించి సీబీఐ తండ్రీ కొడుకులిద్దరినీ ఒకేసారి విచారణ చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే చాలామందిని అరెస్టు చేసిన సీబీఐ తాజాగా అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. రెండ్రోజుల్నించి అవినాష్ రెడ్డి విచారణ వాయిదా పడుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని తప్పకుండా అరెస్టు చేసే అవకాశాలుండటంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండ్రోజుల పాటు తెలంగాణ హైకోర్టులో వాడి వేడి వాదనల అనంతరం అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 25 వరకూ అరెస్టు చేయవద్దని..రోజూ విచారణను ఆడియో, వీడియా రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.


బెయిల్ పిటీషన్‌పై విచారణ కొనసాగుతుండటంతో అవినాష్ రెడ్డి విచారణను సీబీఐ రెండుసార్లు వాయిదా వేసింది. ఇవాళ ఎట్టకేలకు ఐదవసారి విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో అరెస్టు అయిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ కస్టడీలో తీసుకుని ఉండటంతో ఇవాళ ఇద్దరిని అంటే తండ్రీ కొడుకుల్ని ఒకేసారి విచారించనుంది. కేసును పక్కదారి పట్టించడంలో ఈ ముగ్గురి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదిస్తోంది. హత్యకు కుట్ర చేయడం, ఆధారాలు చెరిపేయడం, గుండెపోటుగా ప్రచారం చేయడానికి ప్రయత్నించారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఉన్న లీడ్స్ ఆధారంగా విచారణ జరుపుతోంది సీబీఐ. 


Also read: YS Avinashreddy: ముందస్తు బెయిల్ విచారణ ప్రారంభం, సీబీఐ విచారణ రేపటికి వాయిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook