Ycp Leaders: అధికార పార్టీ వైసీపీలో కేబినెట్ మంటలు చల్లారినట్లేనా..? నేతల మధ్య సఖ్యత కుదిరిందా..? వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కలిసి పనిచేస్తారా..? నేతలకు సీఎం జగన్‌ ఎలాంటి దిశానిర్దేశం చేశారు..? సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో సక్సెస్ అవుతారా..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఆ సమయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. మంత్రి పదవులు రాని నేతల అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. వైసీపీ అధిష్టానంపై అలక బూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎవరికీ వారు అనుచరులతో సమావేశమై..భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు పార్టీకి దూరమవుతున్నారని ప్రచారం జరిగింది. బుజ్జగించడానికి వెళ్లినా పార్టీ పెద్దలను రాజీనామాలు సైతం ఇచ్చారని ఊహాగానాలు వినిపించాయి.


రంగంలోకి దిగిన సీఎం జగన్.. మాజీ మంత్రులు బాలినేని, అనిల్ కుమార్, సుచరిత, కొడాలి నాని, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి వంటి నేతలతో విడివిడిగా సమావేశమైయ్యారు. పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆ పార్టీలో కేబినెట్ మంటలు చల్లారినట్లు కనిపించింది. ఐతే నేతల మధ్య సఖ్యత కుదిరినట్లు కనిపించడం లేదు. ఎవరికి వారుగా విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవల మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి నెల్లూరు జిల్లాకు కాకాణి వచ్చారు. ఆ సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విడిగా అనుచరులతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్పట్లో ఈ అంశం రాజకీయంగా దుమారం రేగింది. 


ఇలా ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. మంత్రి పదవులు పొందిన నేతలకు రాని వారి మధ్య గ్యాప్‌ పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అనుచరులు సైతం ఎవరికీ వారుగా ముందుకు వెళ్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమ పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని వస్తున్న వార్తలను వైసీపీ(YCP) అధిష్టానం ఖండించింది. తాము అంతా ఒకే తాటిపై ఉన్నామని..వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టామని..సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామంటున్నారు. ఎవరూ ఎన్ని కూటములతో వచ్చినా..సీఎం జగన్‌కే ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేస్తున్నారు. కష్టం కాలంలోనూ సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలను ఇంటింటికి వివరిస్తామంటున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు. 


Also read:Petrol Price Today: చమురు సంస్థలు కీలక ప్రకటన.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?


Also read:North Korea: ఉత్తర కొరియాలో డేంజర్ బెల్స్... దేశంలో తొలి కోవిడ్ మరణం... 3.50 లక్షల మందిలో జ్వర లక్షణాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook