Badvel Bypoll: ఏపీలో బద్వేలు ఉపఎన్నికకు శంఖారావం మోగింది. కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్(Central Election Commission)షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హూజూరాబాద్, ఏపీలోని బద్వేలు (Badvel Bypoll)స్థానాలకు ఉపఎన్నికల అక్టోబర్ 30 పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న కౌంటింగ్ ,ఫలితాలు వెలువడనున్నాయి. బద్వేలు నుంచి అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య హఠాన్మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బద్వేలు అసెంబ్లీ స్థానానికి (Badvel Bypoll Ycp Candidate)అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది.


బద్వేలు ఉపఎన్నిక వైసీపీ(YCP)అభ్యర్ధిని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)ప్రకటించారు. దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధ బద్వేలు నుంచి పోటీ చేయనున్నారని సజ్జల చెప్పారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్ ఇవ్వడం తమ సంప్రదాయమని అన్నారు. సానుభూతిగా మిగిలిన పార్టీలో పోటీలో ఉండకపోవడం కూడా సాంప్రదాయమని..ఒకవేళ ఉన్నాసరే పట్టించుకోమన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీకు అభిమానం పెరుగుతోందని గుర్తు చేశారు. ప్రజల అభిమానం, ఆదరణ తమ పార్టీకు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలనేది తమ అభిమతమన్నారు. ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుని, భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 


మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే ఆయనకే ఇబ్బందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సినీ పరిశ్రమలోని పెద్దలే ఆయన్ని గుదిబండగా భావిస్తున్నారన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారన్నారు. సినిమా థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. సినీ పరిశ్రమతో చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమేనన్నారు. 


Also read: Bypolls Schedule: హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook