Ys Jagan: ఏపీలో అటు కూటమి ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇరువురూ వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కీలకనేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆట ఆరంభించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలపై గురి పెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్ జగన్ దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. అటు ప్రభుత్వంపై పోరుబాట చేస్తూనే పార్టీపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ..జిల్లాల్లోనే బసచేసేందుకు నిర్ణయించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ తనపై విమర్శలు ఎక్కుపెడుతున్న చెల్లెలు వైఎస్ షర్మిలను టార్గెట్ చేశారు. షర్మిల పదవికి చెక్ పెట్టేలా ఢిల్లీ నుంచి ఆట మొదలెట్టారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తండ్రి వైఎస్‌తో పనిచేసి ప్రస్తుతం పార్టీలో కొనసాగలేని నేతలతో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ పీసీసీ ఛీఫ్ శైలజానాథ్‌తో సమావేశమయ్యారు. ఈయనతో సహా 8 మంది సీనియర్ నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు సమాచారం. 


వైఎస్ షర్మిల టార్గెట్


పీసీసీ ఛీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వైఎస్ షర్మిల ప్రతి సందర్భంలోనూ  అధికార పార్టీ కంటే ప్రతిపక్షం జగన్‌పైనే విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయకుండా జగన్‌పై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. షర్మిల నాయకత్వంలో పనిచేయలేమంటూ కొందరు సీనియర్లు గళం విప్పారు. ఈ అంశాల్ని తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. షర్మిల పదవికి చెక్ పెట్టేందుకు తన మార్క్ రాజకీయం మొదలెట్టారు. 


Also read: Heavy Rain Alert: తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.