Heavy Rain Alert: తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం ఏపీవైపుకే దూసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2024, 09:05 AM IST
Heavy Rain Alert: తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

Heavy Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం కాస్తా ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా పయనించనుందని ఐఎండీ వెల్లడించింది. 

Add Zee News as a Preferred Source

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా ఉంది. ఆ తరువాత 24 గంటల్లో ఉత్తరాంధ్రవైపుకు కదలనుంది. దాంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం కారణంగా ఇవాళ, రేపు ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ డిసెంబర్ 19న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

ఇక డిసెంబర్ 20న అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పార్వతీపురం మన్యం, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన ఉంది. 

Also read: Seize the Ship: సీజ్ ది షిప్ కాదు..రిలీజ్ ది షిప్, పవన్ కళ్యాణ్‌కు షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Trending News