Ys Jagan on Chandrababu: ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్‌లతో కన్పిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాల్సి వచ్చినా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రతి చోటా పేకాట క్లబ్‌లు, మాఫియా వ్యవహారం నడుస్తోందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఐదేళ్లలో తన హయాంలో పాలన ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లలో దాదాపు అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన అడుగులు పడితే ఇప్పుడంతా తిరోగమనంలో పయనిస్తున్నామని మండిపడ్డారు. సూపర్ సిక్స్‌లు కన్పించవని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు విన్పించవని, ఇదేంటని ప్రశ్నిస్తే రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ ఫాలో అవుతున్నారన్నారు. ప్రజలు మేలు చేయాలనే ఆలోచనతో ప్రతి అడుగు వేస్తూ ఎన్నడూ లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే ఇప్పుడంతా నీరుగార్చారని విమర్శించారు. లంచాల్లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డెలివరీ చేశామని గుర్తు చేశారు. 


తమ హయాంలో మూడు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా సాగిందని వాటి వల్ల ఆదాయం పెరుగుతుందని గుర్తు చేశారు. అంతేకాకుండా ఉపాధి పెరుగుతుందన్నారు. వైద్య కళాశాలలు, పోర్టులు భవిష్యత్ ప్రజల సంపదని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కార్యక్రమాలివేనని చంద్రబాబుకు సూచించారు. తమ హయాంలో అవినీతికి తావు లేకుండా చేస్తే ఇప్పుడు మళ్లీ జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడో త్రైమాసికం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకూ విద్యా దీవెన చెల్లించలేదని దుయ్యబట్టారు. వాలంటీర్లను మోసం చేశారన్నారు. 


గ్రామీణ, పట్టణ రోడ్లపై టోల్ వసూలు చేసి ఇదే సంపద సృష్టి అనే భ్రమలో ఉన్నారని మండిపడ్డారు. అదే జరిగితే ఇక ప్రజల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 


Also read: SC Reservations: మతం మారితే నో రిజర్వేషన్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.