AP: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. నేర చరిత్ర ఉన్నవారికే రాజకీయాలు బాగా పనికొస్తున్నాయని చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. నేర చరిత్ర ఉన్నవారికే రాజకీయాలు బాగా పనికొస్తున్నాయని చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్ ( Rajyasabha mp pilli subhash chandra bose ) ఇవాళ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నాడు నేడు ( Naadu nedu ) ముగింపు పాదయాత్ర సందర్బంగా ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నేర చరిత్ర ఉన్న వారికే రాజకీయాలు బాగా పనికొస్తున్నాయని, అక్రమ సంపాదన రాజకీయ మార్గం అయిందని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయన్న సుభాష్ చంద్రబోస్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఈ వ్యాఖ్యలు క్యాజువల్ గా చెప్పినవా లేదా ఎవరినైనా ఉద్దేశించి చేసినవా అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఎంపీ సొంత నియోజకవర్గానికి చెందిన మరో వైసీపీ నేత తోట త్రిమూర్తులు..ఈయనకు ప్రత్యర్ధి. ఒకే పార్టీలో ఉన్నా...తోట త్రిమూర్తులు ( Ycp leader Thota trimurthulu ) వ్యతిరేకంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్..ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితకు ( Ap home minister Sucharita ) లేఖ కూడా రాశారు. దళితుల శిరోముండనం కేసు వేగవంతం చేయాలని కోరారు. ఈ పరిణామాలకు తోడు తాజాగా చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా తోట త్రిమూర్తులుని ఉద్దేశించి చేసినవేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఒకే పార్టీలో ఉంటూ..తోటి పార్టీ సభ్యుడిపై ఇలా వ్యాఖ్యలు చేయడం కూడా మంచిది కాదు..తప్పుడు సంకేతాలు పంపిస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి
Also read: AP: చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్..చర్చకు సిద్ధమా