Rajyasabha: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఎంపీ , వైసీపీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, జీఎస్టీ అంశాలపై మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ(Vizag steel plant privatisation)నిర్ణయం సరైంది కాదని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్ధిక బిల్లుపై జరిగిన చర్చ సందర్బంగా ఏపీకు సంబంధించిన పలు అంశాల్ని ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వం వనరులు సమీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నా..కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో త్యాగాల ద్వారా విశాఖ స్టీల్‌ప్లాంట్(Vizag steel plant)సాధించుకున్నామని గుర్తు చేశారు. రుణాల్ని వాటాలుగా మారిస్తే ప్లాంట్ మళ్లీ లాభాల్లోకి వస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలన్నారు. 


రాష్ట్రానికి కేంద్ర పన్నుల ద్వారా వస్తున్న వాటా క్రమంగా తగ్గుతోందని అన్నారు. జనాభాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పన్నుల వాటాలో కోత విధిస్తున్నారని..దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాతం చూపిస్తున్నారని విజయసాయి రెడ్డి (Vijayasai reddy)తెలిపారు. జనాభా ఆధారంగా పన్నుల వాటాను నిర్ధారించే పద్ధతిని మార్చుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా(Ap special status)ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. 


మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా 120 కోట్ల రూపాయలు జీఎస్టీ (GST)చెల్లిస్తోందన్నారు. హిందూత్వకు తామే ప్రతినిధులమని చెప్పుకునే బీజేపీ..ప్రభుత్వ దేవాలయాలపై పన్నులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆఖరికి భక్తులు బసచేసే గదులపై కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)వాణిజ్య సంస్థ కాదని..లాభార్జన కోసం అక్కడ కార్యక్రమాలు జరగడం లేదన్నారు. దేవుడి సేవ కోసమే భక్తులున్నారన్నారు. జీఎస్టీ వ్యవస్థ కంటే ముందు టీటీడీపై పన్నుల భారం లేదని..తక్షణం కేంద్రం తిరుమలపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలన్నారు. 


Also read: Sajjala Ramakrishna reddy: స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషనర్ రెండు నాల్కల ధోరణి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook