Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా ఢిల్లీలో రెండవరోజు కూడా కొనసాగింది. ధర్నాకు మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాల్లో పోరాటానికి పిలుపునిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు(Visakha steel plant privatisation)వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కార్మికులు చేపట్టారు. తొలిరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన కార్మికులు రెండవరోజు ఆంధ్రాభవన్ ప్రాంగణంలో కొనసాగించారు. కార్మికులు చేపట్టిన ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఉద్యమాన్ని ఇలాగే మరో ఏడాది కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తాయని..అప్పుడు ఏ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. కార్మికుల ధర్నాకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని ఏడాదిపాటు కొనసాగించాలంటే అందరూ కలిసికట్టుగా సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.


వైజాగ్ స్టీల్‌ప్లాంట్(Vizag steel plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే న్యాయస్థానాల్ని ఆశ్రయించి..ప్రైవేటీకరణపై స్టే తీసుకొద్దామని సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయంలోనే అనేక అవకతవకలున్నాయని చెప్పారు. అందుకే న్యాయస్థానాల్ని ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని విజయసాయిరెడ్డి(Vijayasai reddy) తెలిపారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..కూడా కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎప్పుడూ కోరుకుంటారని గుర్తు చేశారు. 


Also read: బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు ప్రారంభ తేదీ ఖరారు, పాల్గొనేవారి జాబితా ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook