బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు ప్రారంభ తేదీ ఖరారు, పాల్గొనేవారి జాబితా ఇదే

BiggBoss Season 5 Telugu:బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్ 5 త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పుడు ప్రారంభమయ్యేది తేదీ ఖరారైంది. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 5లో ఎవరెవరుంటారనే విషయంపై స్పష్టత వచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 3, 2021, 12:00 PM IST
బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు ప్రారంభ తేదీ ఖరారు, పాల్గొనేవారి జాబితా ఇదే

BiggBoss Season 5 Telugu:బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్ 5 త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పుడు ప్రారంభమయ్యేది తేదీ ఖరారైంది. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 5లో ఎవరెవరుంటారనే విషయంపై స్పష్టత వచ్చింది.

బుల్లితెరపై బిగ్‌బాస్(BiggBoss) రియాల్టీ షో క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని భాషల్లోనూ ఈ ప్రోగ్రాం మంచి రేటింగ్స్ సాధిస్తోంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు ముగిశాయి. ఇప్పుడు సీజన్ 5కు రంగం సిద్దమైంది. పార్టిసిపెంట్స్ ఎంపిక,సెట్ నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి మే లేదా జూన్ నెలల్లో ప్రారంభం కావల్సి ఉన్నా..కరోనా సెకండ్ వేవ్( Corona Second Wave)వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ ముగించుకుని సెప్టెంబర్ నెలలో ప్రారంభించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబర్ 5వ తేదీన బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. 

బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు(BiggBoss Season 5 Telugu) కోసం ఈసారి కంటెస్టెంట్స్ జాబితాపై వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిపేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, సురేఖ వాణి, టీవీ యాక్టర్ నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, ఈషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, యాంకర్ ప్రత్యూష్, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, సిద్ధార్ధ వర్మ-విష్ణుప్రియ, ప్రముఖ సింగర్ మంగ్లీ పేర్లున్నాయి. అయితే మంగ్లీ అయిష్టత చూపిస్తోంది. అటు బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం ఏదో విధంగా మంగ్లీని ఒప్పించాలని ఆలోచిస్తున్నారు. 

Also read: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు, కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News