YSR EBC Nestham launched : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 3,92,674 మంది ఈ స్కీమ్‌ ద్వారా లబ్ది పొందనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 589 కోట్లను విడుదల చేసింది. ఒక్కో మహిళకు సంవత్సరానికి రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం 45,000 ఆర్థికసాయాన్ని ఈ పథకం కింద అందిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నామని సీఎం జగన్‌ (CM YS Jagan Mohan Reddy) పేర్కొన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారంటూ జగన్ అన్నారు. వారందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. 


వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham) పథకం మహిళల ఆర్థిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, వెలమ, క్షత్రియ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఆర్థిక సాయం అందుతుందని చెప్పుకొచ్చారు సీఎం జగన్. 


రిపబ్లిక్‌డేకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమం చేపట్టడం గర్వంగా ఉందని సీఎం జగన్‌ చెప్పారు. రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రతి అడుగూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుగు అడుతు వేస్తున్నామని జగన్ తెలిపారు. 


ఇక వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం అనేది తాము ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాల్లో లేదన్నారు జగన్. (YS Jagan) అలాగే మేనిఫెస్టోలోనూ తాము చెప్పలేదన్నారు. పేద వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. 


Also Read : Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ.. డీహెచ్ శ్రీనివాసరావు కీలక ప్రకటన


ఇక ఈ కార్యక్రమంలో ఏపీ (AP) పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రెడ్డి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, కమ్మ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌ రావు, క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్, ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, ఈడబ్యూఎస్‌ స్పెషల్‌ సీఎస్‌ జీ.అనంతరాము, జీడబ్యూఎస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, జీడబ్యూఎస్‌ డైరెక్టర్‌ షన్‌ మోహాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Also Read : Budget Session 2022: వేర్వేరు సమయాల్లో జరుగనున్న ఉభయ సభలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.