YSR Jayanthi: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. కొంత మందికి పదవుల అలంకారం అయితే.. మరికొందరు ఆ పదవులకే వన్నె తెస్తారు. అలాంటి మహా నేతల్లో రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని 2004, 2009లో అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా ఖ్యాతి గడించారు. అంతేకాదు..కేంద్రంలో యూపీఏ -1, యూపీఏ -2 ప్రభుత్వాలు ఏర్పడడానికి ఆయన చేసిన కృషి వల్లే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఒక టర్మ్ మొత్తం ముఖ్యమంత్రిగా పనిచేసి రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు కూడా రాజశేఖర్ రెడ్డి కావడం గమనార్హం. ఎన్టీఆర్ మూడు సార్లు అధికారంలో వచ్చినా.. అందులో ఒకసారి రెండేళ్లు.. ఆ తర్వాత ఐదేళ్లు పరిపాలించారు. ఇక 1994లో అన్నగారు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ రకంగా ఉమ్మడి ఏపీలో రాజకీయంగా పలు రికార్డులు క్రియేట్ చేసారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పలు ప్రజా కర్షక పథకాలతో వైయస్ చిరస్థాయిగా నిలిచిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఆయనకు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైయస్ఆర్ అసలుసిసలు ప్రజా నాయకుడు అంటూ కీర్తించారు.  అంతేకాదు ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు YSR నిలిచారు.  అంతేకాదు YSR మరణం అత్యంత విషాదకరం. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు.



YSR బ్రతికి ఉంటే ఆంధ్ర ప్రదేశ్  ముఖ చిత్రం వేరేలా ఉండేది. YSR బ్రతికి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావు. YSR వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకు వెళ్తుందని కొనియాడారు. వైయస్ఆర్ లో ఉన్న ధైర్యం,సిద్ధాంతాలు,న్యాయకత్వ లక్షణాలు షర్మిల లో చూశానని కొనియాడారు. నేను వ్యక్తిగతంగా YSR నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. YSR పాదయాత్ర నా జోడో యాత్రకు స్ఫూర్తి అంటూ కొనియాడారు. నాడు YSR ఎండను,వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ఆయనే నాకు స్ఫూర్తి ఆయన వల్లే నేను జోడో యాత్రను ఎంతో ఉత్సాహాంగా పూర్తి చేశారు.


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి