Ysr Pension Scheme: కరోనా సంక్షోభంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఒకటవతేదీ వస్తే చాలు ఠంచనుగా పెన్షన్ ఇంటికి అందుతోంది. ఉదయం నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ రాష్ట్రంలో కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా సంక్షోభ(Corona Crisis) సమయంలో సైతం సంక్షేమ పథకాల్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది. ప్రతి నెలా 1వ తేదీ వస్తే చాలు..ఉద్యోగుల జీతం వస్తుందో లేదో కానీ వృద్ధులకు పెన్షన్ మాత్రం అందుతోంది. అది కూడా ఉదయాన్నే..ఇంటి దగ్గరకొస్తోంది. ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్ (Volunteers)వ్యవస్థ పెన్షన్లను ఇంటివరకూ అందిస్తోంది. ఇవాళ ఆగస్టు 1వ తేదీ కావడంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక (Ysr Pension Scheme)పంపిణీ ఉదయమే ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోసం ప్రభుత్వం 1455 కోట్ల రూపాయలు కేటాయించింది.రాష్ట్రంలో ఉన్న 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల 50 వేల 377 మంది పెన్షనర్లకు ఒకటవతేదీనే పెన్షన్ అందేలా కార్యక్రమం నడుస్తోంది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి..బయోమెట్రిక్, ఐరిస్ విధానం ద్వారా లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నారు. ఇంటివద్దకే పెన్షన్ అందడంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకే దాదాపుగా 69.88 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయింది.


Also read: ఏపీ మెగా ఐటీ హబ్‌గా విశాఖపట్నం, ఐటీ రీసెర్చ్ యూనివర్శిటీ ఏర్పాటు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook