YSRCP on Chandrababu Naidu: ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభల్లో వరుసగా విషాద ఘటనలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇరుకు సందుల్లో చంద్రబాబు సభలు పెట్టడం వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అధికార వైసీపీ ఆరోపిస్తుండగా.. వైసీపీ పక్కా స్కెచ్‌తోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని టీడీపీ విమర్శిస్తోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చింది. చంద్రబాబు నిర్లక్ష్యం, తప్పుల వల్ల వారం రోజుల్లో నిర్వహించిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడింది. బాబు తన పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని.. తాను నాయ‌కుడిని కాదు న‌ర‌హంత‌కుడిన‌ని నిరూపిస్తున్నారని విమర్శించింది. 


తొక్కిస‌లాట‌లో మృతి చెందిన వారి ఆత్మ‌కు శాంతి కలగాలని, ఇందుకు కారణమైన బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా విభాగంలో డీపీని బ్లాక్ ప్రొఫైల్ పిక్చర్‌కి మార్చింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, శ్రేణులకు ప్రొఫైల్ పిక్చర్ మార్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డీపీలు మార్చి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 


 



మరోవైపు చంద్రబాబు సభల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రహదారులపై సభలు, సమావేశాలను రద్దు చేసింది. అదేవిధంగా మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించింది. అధికారులు ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి ఉంటుందని పేర్కొంది. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇటీవల రెండు దుర్ఘటనల నేపథ్యంలో హోంశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read: Thief Sleeping: దొంగతనానికి వచ్చి తాపీగా నిద్రపోయిన దొంగ.. చివరికి ఊహించని ట్విస్ట్   


Also Read: Post Office Scheme: పోస్టాఫీసు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం.. పూర్తి వివరాలు ఇవిగో..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి