Devendra Reddy On Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటునే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు మూవీ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా కోసం పవన్ మళ్లీ తనలోని మార్షల్ ఆర్ట్స్ స్కిల్‌కు పదును పెడుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందుకు సబంధించిన పిక్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ ఫొటోపై మాత్రం వైసీపీ నేతలు ట్రోలింగ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత దేవేందర్ రెడ్డి గుర్రంపాటి వ్యగ్యంగా కౌంటర్ ఇచ్చారు. 'మిస్టర్ ప్యాకెజీ స్టార్.. ఏంటి ఈ హౌలే  వేషాలు.. పైగా నీకో పార్టీ, నువ్వొక అధ్యక్షుడివి, అసలు నీలో నాయకుడి లక్షణాలు ఉన్నాయా..! ప్యాకేజీ కక్కుర్తిపడి వీకెండ్ పాలిటిక్స్‌కు పరిమితమైతే ఇలాంటి పోరంబోకు వేషాలే వస్తాయి. ముందు సినిమాకి రాజకీయాలకు తేడా తెలుసుకో ..' అంటూ ట్వీట్ చేశారు. 




ఇటీవల తాను ఫెయిల్డ్ పొలిటిషియన్‌ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కూడా దేవేందర్ రెడ్డి ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. 'చదువులో ఫెయిల్.. సినిమాలు 90% ఫెయిల్.. పెళ్లిళ్లు 3 ఫెయిల్.. తమ్ముడిగా ఫెయిల్.. కొడుకుగా ఫెయిల్.. భర్తగా ఫెయిల్.. తండ్రిగా ఫెయిల్.. జీవితం ఫెయిల్.. రాజకీయ నేతగా అట్టర్ ఫెయిల్.. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఓ గుండు సున్నా'.. అంటూ ఆయన పోస్ట్ చేశారు. 


మరోవైపు దేవేందర్ రెడ్డిపై జనసైనికులు ఫైర్ అవుతున్నారు. 'ఏరా గుర్రం...! నువ్వెంట్రా..! వారానికో ట్వీట్ వేస్తున్నావ్. స్టేట్ సోషల్ మీడియా ఇంఛార్జ్ అయి ఉండి.. ఎవడి కొంప తగలబెడుతున్నావ్. మార్షల్ ఆర్ట్స్ అంటే పోరంబోకు వేషాలని జగన్ రెడ్డీ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ఉందా..? నోటికి వచ్చినట్టు వాగితే రేపటి రోజు నోట్లో నీళ్ళు పోసుకునే అవకాశం కూడా ఉండదు' అంటూ తీవ్రస్థాయిలో కామెంట్స్ పెడుతున్నారు. 


'ఒరేయ్ పనీపాటా లేని పోరంబోకు.. జనాల ట్యాక్స్ డబ్బులు జీతంగా బొక్కుతున్న హౌలే.. నువ్వొక ప్రభుత్వ డిజిటల్ మీడియా సలహాదారుడివి, నీలో ఆ లక్షణాలు ఉన్నాయా రా గూట్లే..? జైల్ రెడ్డి పెట్టే ఎంగిలి మెతుకులు తినే కుక్కా.. ముందు వృత్తిగత జీవితానికి, రాజకీయానికి తేడా తెలుసుకోరా సోంభేరీ..!' అంటూ బండ బూతులు తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి పోస్టులు పెట్టినా దేవేందర్ రెడ్డి సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ.. వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం.. జనసైనికులు బూతులతో రెచ్చిపోవడం కామన్‌గా మారింది. 


Also Read: Cyclone Mandous Effect: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో కుంభవృష్టి.. జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు


Also Read:Adibatla Young Woman Kidnap Case: కిడ్నాప్ అయిన యువతి సేఫ్.. వెలుగులోకి సంచలన విషయాలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి