Adibatla Young Woman Kidnap Case: కిడ్నాప్ అయిన యువతి సేఫ్.. వెలుగులోకి సంచలన విషయాలు

Young Woman Kidnapped In Adibatla: తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో కిడ్నాప్ అయిన యువతిని పోలీసులు రక్షించారు. ఆరు గంటల్లోనే యువతిని రక్షించి.. తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 08:05 AM IST
  • యువతిని రక్షించిన పోలీసులు
  • ఇప్పటివరకు 8 మంది అరెస్ట్
  • పరారీలో మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి
Adibatla Young Woman Kidnap Case: కిడ్నాప్ అయిన యువతి సేఫ్.. వెలుగులోకి సంచలన విషయాలు

Young Woman Kidnapped In Adibatla: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ సిరి టౌన్ షిప్‌లో కిడ్రాప్‌కు యువతి వైశాలి క్షేమంగా బయట పడింది. కిడ్నాప్ అయిన 6 గంటల్లోపే వైశాలిని పోలీసులు రక్షించారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. వైశాలిని కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. దుండగులు ఆమెను బాగా హింసించి, కొట్టడం వల్ల డీప్ డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పారు. ఆమె ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉందన్నారు. 

ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని.. నవీన్ అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. మిగతా నిందితులని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. కిడ్నాపర్లను కేవలం ఆరు గంటల్లోనే పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లకు చెందిన వైశాలి అనే యువతిని 100 మందితో వచ్చి నవీన్ రెడ్డి అనే ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. యువతి ఇంటిపై దాడి చేసి.. అడ్డు వచ్చిన తల్లిదండ్రులను చితకబాది మరీ ఎత్తుకుపోయారు. ఈ కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నవీన్ రెడ్డి టీ టైమ్ ఓనర్‌ కాగా.. వైశాలి డాక్టర్ చదువుతోంది. వైశాలిని నవీన్ రెడ్డి ప్రేమించగా.. తల్లిదండ్రులు వేరే అబ్బాయితో నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. దీంతో నవీన్ రెడ్డి శనివారం పట్టపగలు 100 మంది కిరాయి గుండాలతో ఇంట్లోకి వచ్చి యువతి కిడ్నాప్ చేశాడు. 

కిడ్నాప్‌ ఘటనలో స్థానిక పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. డయల్ 100కు కాల్ చేసిన 45 నిమిషాల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు వచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డితో వివాహం ఇష్టం లేక గతంలోనే బాధితురాలు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలింది. స్వయంగా మెజిస్ట్రేట్ ముందు తనకు పెళ్లి ఇష్టం లేదని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నవీన్ రెడ్డిపై స్టేట్‌మెంట్ ఇచ్చింది. 

దీంతో తనను కాదని మరో వ్యక్తితో వివాహం చేస్తున్నారని కోపంతో నవీన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. శనివారం ఈరోజు పెళ్లిచూపులు ఉన్నాయని తెలుసుకుని.. 100 మందితో దాడి చేశాడు. పట్టపగలు వందమంది ఇంట్లోకి చొరబడి రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపింది. తన టీ స్టాల్‌కు వచ్చే వ్యక్తులు, కొంతమంది స్టూడెంట్స్‌కు డబ్బులు ఇచ్చి పట్టపగలు కిడ్నాప్ చేయించాడు నవీన్ రెడ్డి. 

ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇంటిపై నవీన్ అండ్ గ్యాంగ్ దాడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ గతంలో వైశాలిని, తల్లిదండ్రులని నవీన్ రెడ్డి బెదిరింపులకు దిగినట్లు తేలింది. పథకం ప్రకారమే వైశాలి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని.. టీ స్టాల్ కోసం కట్టడాలు కట్టినట్లు కూడా తెలిసింది. తన కూతురు కిడ్నాప్‌కు మరి కొంతమంది స్థానికుల ప్రమేయం ఉందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.

సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. దాడి చేసిన వారిలో ఇప్పటికే 40 మందికి పైగా యువకులను గుర్తించారు. కిడ్నాప్ తర్వాత అమ్మాయిను నవీన్ రెడ్డి అప్పగించి చాలా మంది యువకులు పరార్ అయ్యారు. పథకం ప్రకారమే సెల్ ఫోన్లు వాడకుండా స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. ఎలాంటి ఆధారాలు దొరకవద్దని వైశాలి ఇంటి వద్ద పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.  

Also Read: Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు  

Also Read: Ind Vs Ban: నేడే ఆఖరి వన్డే.. క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకునేందుకు టీమిండియా మాస్టర్ ప్లాన్..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x