Cyclone Mandous Effect: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో కుంభవృష్టి.. ఏ జిల్లాలో ఎంత వర్షపాతం అంటే..?

Mandous Cyclone Andhra Pradesh: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు వణుకుతున్నాయి. ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 02:12 PM IST
  • వణికిస్తున్న మాండూస్ తుఫాన్
  • ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
  • జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు ఇవే..
Cyclone Mandous Effect: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో కుంభవృష్టి.. ఏ జిల్లాలో ఎంత వర్షపాతం అంటే..?

Mandous Cyclone Andhra Pradesh: మాండూస్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి కీలక సూచనలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం, ఆదివారం రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని  ఆదేశించారు.

వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని సీఎస్ సూచించారు. ఈటెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని చెప్పారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 8.30 గం.ల నుంచి శనివారం ఉ.8.30 గంటల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5, ప్రకాశం జిల్లాలో 14.1, నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన వివరించారు.

అంతకుముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి తుఫాన్‌పై జగన్‌ సమీక్షించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. వివిధ జిల్లాల్లో తుఫాను ప్రభావంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి.. వారికి అన్నిరకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.

Also Read: Pawan Kalyan: ట్యాక్స్ కట్టేందుకు పవన్ కళ్యాణ్‌ రూ.5 కోట్ల అప్పు.. జనసేన నేత వీడియో వైరల్  

Also Read: Ind Vs Ban: మళ్లీ టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. రెండు కీలక మార్పులతో భారత్ బరిలోకి..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News