Malladi Vishnu: హైదరాబాద్‌కి కల్చర్ నేర్పిందే మేము... కేటీఆర్ కామెంట్స్‌పై మల్లాది విష్ణు కౌంటర్...
Malladi Vishnu Counter Attack to KTR: క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ అధికార పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. పక్క రాష్ట్రంలో పరిస్థితి అద్వాన్నంగా ఉందని తన మిత్రుడు చెప్పాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.
Malladi Vishnu Counter Attack to KTR: పక్క రాష్ట్రంలో పరిస్థితి అద్వాన్నంగా ఉందంటూ తన మిత్రుడొకరు చెప్పారని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ అధికార పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. కేటీఆర్ పరోక్షంగా ఏపీని టార్గెట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు... అసలు హైదరాబాద్‌కు కల్చర్ నేర్పిందే కోస్తాంధ్ర అని పేర్కొన్నారు. కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ది జరిగిందని అన్నారు.
హైదరాబాద్‌ను చూసుకుని కేటీఆర్ మురిసిపోతున్నారని... ఇదే దోరణి కొనసాగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగి ఏర్పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మల్లాది విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా రాష్ట్రం విడిపోయిందన్నారు. అసలు తమకొచ్చిన అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ లాగే కేటీఆర్ కూడా పిట్ట కథలు చెబుతున్నారని విమర్శించారు.
ఇదే అంశంపై ఏపీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకసారి విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ది ఏంటనేది తెలుస్తుందన్నారు.
ఎందుకంత ఉలికిపాటు : కర్నె ప్రభాకర్
వైసీపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. ఎందుకంతలా ఉలికిపడుతున్నారని వారిని ప్రశ్నించారు. కేటీఆర్ పొరుగు రాష్ట్రాల గురించే కాదు ఉత్తరాది రాష్ట్రాల గురించి కూడా ప్రస్తావించారన్నారు. మిత్రులు తనతో పంచుకున్న విషయాలనే కేటీఆర్ ప్రస్తావించారని పేర్కొన్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గరలో ఉన్నాయని మల్లాది విష్ణు పేర్కొనడాన్ని తప్పు పట్టారు. తెలంగాణ ప్రజలు అంత అమాయకంగా లేరని... భ్రమల్లో ఉండి పగటి కలలు కనవద్దని అన్నారు. 2014 కన్నా ముందు తెలంగాణకు రూ.18 వేల కోట్లకు మించి బడ్జెట్ లేదని... అందులో ఎన్నడూ రూ.11 వేల ఖర్చు చేయలేదని అన్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లుగా ఉందన్నారు. కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతోందన్నారు.
Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయొద్దు... చేస్తే అశుభమే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook