Hemant Soren and KCR: హేమంత్ సోరెన్ వర్సెస్ కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ మధ్య ఆ మూడు గంటల్లో ఏం జరిగింది

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి గత కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. మొన్న జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో కూడా ఇదే విషయం చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా బీజేపీయేతర ప్రభుత్వాల్ని కలుపుకుంటూ వెళ్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేసీఆర్, కేటీఆర్ మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Hemant Soren and KCR: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి గత కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. మొన్న జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో కూడా ఇదే విషయం చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా బీజేపీయేతర ప్రభుత్వాల్ని కలుపుకుంటూ వెళ్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేసీఆర్, కేటీఆర్ మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
 

1 /4

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరి, అనుసరిస్తున్న విధానంపై ఇరువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా కేంద్రంపై ఎదురుదాడి ప్రారంభించాలని నిర్ణయించారు. 

2 /4

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా ఇరువురి మధ్య కేంద్ర ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై చర్చ సాగింది. 

3 /4

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇతర రాష్ట్రాలపై మోదీ అనుసరిస్తున్న ధోరణి ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాలు ఏకమై..కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన అవసరముందని ఇటు కేసీఆర్ అటు హేమంత్ సోరెన్ నిర్ణయించినట్టు సమాచారం. 

4 /4

హేమంత్ సోరెన్-కేసీర్ మధ్య జరిగిన భేటీలో కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. త్వరలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించేందుకు ఇద్దరు ముుఖ్యమంత్రులు నిర్ణయించడం విశేషం.