Amaravati Lands Scam: చంద్రబాబు అండ్ కో భూముల్ని లాక్కున్నారు, సాక్ష్యాలివే : ఎమ్మెల్యే ఆర్కే
Amaravati Lands Scam: ఏపీలో అమరావతి భూముల కుంభకోణం కేసు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూడటంతో ప్రకంపనలు రేగుతున్నాయి. కీలక వ్యక్తి సాక్షిగా మారడంతో పాటు..ఎమ్మెల్యే ఆర్కే విడుదల చేసిన సాక్ష్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Amaravati Lands Scam: ఏపీలో అమరావతి భూముల కుంభకోణం కేసు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగు చూడటంతో ప్రకంపనలు రేగుతున్నాయి. కీలక వ్యక్తి సాక్షిగా మారడంతో పాటు..ఎమ్మెల్యే ఆర్కే విడుదల చేసిన సాక్ష్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏపీ అమరావతి భూముల కుంభకోణం(Amaravati Lands Scam) కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. అప్పటి సీఆర్డీఏ కమీషనర్ చెరుకూరి శ్రీధర్ సాక్షిగా మారడంతో కీలకాంశాలు బయటికొచ్చాయి. ముఖ్యంగా రెవిన్యూ రికార్డుల మాయంపై వివరణ వచ్చింది. మరోవైపు చంద్రబాబు అతని మనుషులు దళితుల్ని బెదిరించి భూముల్ని లాక్కున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తూ..దీనికి సంబంధించిన సాక్ష్యాధారాల వీడియాను విడుదల చేశారు. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని..దీనికి సాక్ష్యాలున్నాయని ఆర్కే తెలిపారు. అసైన్డ్ భూముల జాబితాను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారని..పథకం ప్రకారం దళితుల్లో భయాన్ని సృష్టించారన్నారు. భూముల జాబితా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిన తరువాతే రాజధాని ప్రకటించారని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితుల భూముల్ని కొనుగోలు చేశారని..చంద్రబాబు(Chandrababu) సూచించిన పేర్లను జాబితాలో ఎక్కించి ప్రభుత్వం రికార్డుల్ని మార్చేశారన్నారు. అమరావతి భూముల అక్రమాలపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేయాలన్నారు.
సీఆర్డీఏ (CRDA)ఏర్పడక ముందే నాటి మంత్రుల చేతుల్లో భూముల లిస్ట్ ఉందన్నారు ఆర్కే. తుళ్లూరులో ఒక్క రికార్డు కూడా లేకుండా దొంగతనంగా తీసుకెళ్లారని ఆరోపించారు. నాలుగైదు వేల ఎకరాల్ని కొట్టేయడానికి స్కెచ్ వేశారన్నారు. చంద్రబాబు, నారాయణ(Ex minister Narayana) కలిసే దళిత సోదరుల్ని మోసం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో కొందరు అధికారులు ఆ కుంభకోణానికి సహకరించాలని ఆర్కే పేర్కొన్నారు.
Also read: Amaravati lands scam: అమరావతి భూ కుంభకోణంలో కీలక సాక్షి, మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook