YSRCP MLC Challa Bhageeradha Reddy passed away: ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంద. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కొద్ది క్షణాల క్రితం కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం నాడు సాయంత్రం నాలుగున్నర దాటిన తర్వాత కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు తీవ్రమైన దగ్గు రావడంతో ఆయనను నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వైద్యుల సూచన మేరకు వెంటనే ఆయనను హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ కి తరలించారు. ఏఐజీ హాస్పిటల్ లో సుమారు రెండు రోజుల నుంచి వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని ఖాళీ ప్రదేశాల్లో రక్తస్రావం జరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. ఆయనని హాస్పిటల్ కు తరలించిన మొదటి రోజు వెంటిలేటర్ పై 100% ఆక్సిజన్ ఇచ్చామని దాన్ని 60 శాతం ఆక్సిజన్ కు తగ్గించామని ఆయన కుదుట పడే అవకాశం వైద్యులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన కన్నుమూసినట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది.


రేపు కర్నూలు జిల్లా అవుకులో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. భగీరథ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి రెండవ కుమారుడు. ఏపీ సీఎం వైఎస్ జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఉండి 2021 జనవరి 1వ తేదీన కరోనా కారణంగా కన్నుమూశారు. ఆ సమయంలో సీఎం జగన్ స్వయంగా కర్నూలు జిల్లాలోని అవుకు వచ్చి ఆయన కుటుంబ సభ్యుల పరామర్శించడమే గాక చల్లా భగీరథ రెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగానే ఆయనని ఎమ్మెల్సీ ని కూడా చేశారు. అది జరిగి మొన్న మే నెలకు ఏడాది పూర్తయింది.


ఇక భగీరథ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూయడంతో ఒకపక్క కార్యకర్తలు, మరోపక్క ఆయన అనుచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చల్లా భగీరథ రెడ్డి వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో యూత్ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండేవారు వైయస్ మరణం తర్వాత తన తండ్రి రామకృష్ణారెడ్డితో సహా భగీరథ రెడ్డి కూడా జగన్ బాటలో నడిచారు. జగన్ సారథ్యంలోని వైసిపి యూత్ వింగ్ కార్యక్రమాల్లో కూడా భగీరథరెడ్డి యాక్టివ్ గా ఉండేవారు. భగీరథ రెడ్డి భార్య శ్రీ లక్ష్మీ ప్రస్తుతం అవుకు జడ్పిటిసిగా ఉన్నారు ఆమె ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగింది.


Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!


Also Read:  Kapu Mla's Meet: కాపులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్, రాజమండ్రిలో కాపు ఎమ్మెల్యేల భేటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook