వైఎస్సాఆర్సీపీ చీఫ్ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' నేటి నుంచి ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. సుమారు 3,000 కిలోమీటర్లు  పాదయాత్ర చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప్రజా సంకల్ప యాత్ర' నేటి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది. యాత్ర ప్రారంభించేముందు జగన్, కుటుంబసభ్యలతో కలిసి తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఆ తరువాత అక్కడే భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది. పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇడుపులపాయకు తరలివచ్చారు.


2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తమ పార్టీ అధికారంలో వస్తే ప్రజలకు మేలు చేసే ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతామో  ప్రజలకు వివరించనున్నారు. రోజుకు 15 కిలోమీటర్లు నడవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, పాదయాత్ర నేపథ్యంలో జగన్ తిరుమలలో శ్రీవారి ఆశీస్సులు, కడప పెదదర్గాను సందర్శించారు. రాష్ట్రం, ప్రజలు బాగుండాలని కోరుకుంటూ తాను 'ప్రజా సంకల్ప యాత్ర' చేస్తున్నానని జగన్ మరోసారి చెప్పారు.