YSRCP Set To Sweep AP Municipal Elections 2021 Results: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను వైఎస్సార్‌సీపీ రిపీట్ చేస్తోంది. 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకుగానూ దాదాపు 25 స్థానాల్లో విజయం సాధించగా, కొన్ని స్థానాల్లో తుది రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకెళ్తోంది. టీడీపీ, బీజేపీలకు షాకిచ్చే ఫలితాల(AP Municipal Election Results 2021)ను అధికార వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కనిగిరిలో 20 వార్డులకుగానూ మొత్తం 20 గెలుపొంది వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీని వైకాసా కైవసం చేసుకుంది. మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైసీపీ, 7 వార్డుల్లో టీడీపీ ఒక వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.


Also Read: AP Municipal Election Results 2021: ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, YSRCP ముందంజ



అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకుగానూ 16 వార్డుల్లో వైకాపా, 4 టీడీపీ గెలుపొందాయి. కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకుగాను 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ(YSRCP) విజయం సాధించింది. ఆత్మకూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో ఇప్పటికే 20 చోట్ల వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు.


Also Read: AP Municipal Elections Counting: 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల కౌంటింగ్



చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 35 వార్డులకుగాను ఇప్పటివరకు 19 వార్డుల్లో గెలిచి మెజార్టీ స్థానాల్లో సత్తా చాటింది. నెల్లూరు జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట, వెంకటగిరిలో అధికార వైకాపా విజయదుందుబి మోగించింది. తూర్పు గోదావరి జిల్లాలోని తుని మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను ప్రస్తుతానికి 18 చోట్ల వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు గెలుపొందారు.


ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఎర్రగుంట్ల, పులివెందుల మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఎర్రగుంట్లలో మొత్తం 20వార్డులకుగాను కౌంటింగ్ జరిగిన 17 వార్డులు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.


Also Read: Eluru Election: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook