Eluru Election: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Eluru Election: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హైకోర్టు అనుమతివ్వడంతో రాష్రవ్యాప్తంగా ముందుగా అనుకున్నట్టుగానే 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు రేపు పోలింగ్ జరగనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2021, 07:08 PM IST
Eluru Election: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Eluru Election: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హైకోర్టు అనుమతివ్వడంతో రాష్రవ్యాప్తంగా ముందుగా అనుకున్నట్టుగానే 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు రేపు పోలింగ్ జరగనుంది. 

ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్(Ap Municipal Elections polling)రేపు అంటే మార్చ్ 10న జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని..వార్డుల విభజన సరిగ్గా జరగలేదని..అభ్యంతరాల్ని స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితా ప్రచురించారంటూ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు(Ap high court) మార్చ్ 8వ తేదీన ఏలూరు ఎన్నికను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేయగా..ఇవాళ ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన ఎన్నికలతో పాటు ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక(Eluru Corporations Elections)లు కూడా జరపడానికి అనుమతిచ్చింది. అయితే ఫలితాల్ని మాత్రం వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చ్ 23వ తేదీకు వాయిదా వేసింది. హైకోర్టు ఉత్తర్వులతో ఇక ఏలూరు కార్పొరేషన్ పోలింగ్ రేపు యధావిధిగా జరగనుంది.

Also read: Ys jagan Review: వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలి : వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News