Here is Top SUVs List under 8 Lakhs: భారతదేశంలో ఎస్‌యూవీ కార్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఎస్‌యూవీ అమ్మకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సూపర్ లుకింగ్, మంచి మైలేజ్ కారణంగా ఎస్‌యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా ఒక మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. బడ్జెట్ రూ. 10 లక్షల వరకు మాత్రమే ఉందా?.. అయినా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. రూ. 10 లక్షల కంటే తక్కువ (ఎక్స్-షోరూమ్) ధరలో వచ్చే 8 ఎస్‌యూవీల జాబితాను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అత్యధికంగా అమ్ముడవవుతున్న టాటా పంచ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.4 లక్షల వరకు ఉంటుంది. ఐకాన్ కార్లు టాటా నెక్సాన్ ధర రూ. 7.80 లక్షల నుంచి రూ. 14.35 లక్షల వరకు ఉండగా.. మారుతీ బ్రెజా ధర రూ. 8.19 లక్షల నుంచి రూ. 13.88 లక్షల వరకు ఉంది. హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.68 లక్షల నుంచి రూ. 13.11 లక్షలు, కియా సోనెట్ ధర - రూ. 7.69 లక్షల నుంచి రూ. 14.39 లక్షలు, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ధర - రూ. 8.41 లక్షల నుంచి రూ. 14.07 లక్షలుగా ఉంది.


10 లక్షల లోపు 8 ఎస్‌యూవీల జాబితా ఇదే:
టాటా పంచ్ (ధర - రూ. 6 లక్షల నుంచి రూ. 9.4 లక్షలు)
టాటా నెక్సాన్ (ధర - రూ. 7.80 లక్షల నుంచి రూ. 14.35 లక్షలు)
మారుతీ బ్రెజా (ధర - రూ. 8.19 లక్షల నుంచి రూ. 13.88 లక్షలు)
హ్యుందాయ్ వెన్యూ (ధర - రూ. 7.68 లక్షల నుంచి రూ. 13.11 లక్షలు)
కియా సోనెట్ (ధర - రూ. 7.69 లక్షల నుంచి రూ. 14.39 లక్షలు)
రెనాల్ట్ కిగర్ (ధర - రూ. 6.50 లక్షల నుంచి రూ. 11.23 లక్షలు)
నిస్సాన్ మాగ్నైట్ (ధర - రూ. 5.97 లక్షల నుంచి రూ. 10.94 లక్షలు)
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 (ధర - రూ. 8.41 లక్షల నుంచి రూ. 14.07 లక్షలు)


ఈ ధరలు అన్ని ఎక్స్ షోరూమ్ అని గుర్తుంచుకోవాలి. పైన ఉన్న కార్లు 5-సీటర్ ఎస్‌యూవీలు. టాటా పంచ్ మైక్రో స్‌యూవీ విభాగానికి చెందినది కాగా.. మిగిలినవన్నీ 4-మీటర్ల స్‌యూవీ విభాగానికి చెందినవి. పంచ్ కాకుండా ఇతర అన్ని స్‌యూవీల యొక్క టాప్ వేరియంట్‌ల ధర రూ. 10 లక్షలకు పైనే ఉన్నాయి. కానీ అన్నింటి ప్రారంభ ధర రూ. 10 లక్షల కంటే తక్కువ. వీటన్నింటిలో కనీసం బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర కూడా రూ.10 లక్షల లోపే ఉంటుంది.


Also Read: Upcoming Bikes 2023: మేలో విడుదల కానున్న బైక్స్.. కేటీఎం, యమహా నుంచి కొత్త బైక్స్!


Also Read: Hyundai Casper Launch 2023: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో.. చిన్న ఎస్‌యూవీని విడుదల చేసిన హ్యుందాయ్! ధర చాలా ఎక్కువ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.