Upcoming Bikes 2023: మేలో విడుదల కానున్న బైక్స్.. కేటీఎం, యమహా నుంచి కొత్త బైక్స్!

Yamaha R3 & MT-03 and 2023 KTM 390 Adventure bikes Coming Soon. భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇంధన వాహనాలకు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా భారీ క్రేజ్ ఉంది.  

Written by - P Sampath Kumar | Last Updated : May 4, 2023, 08:12 PM IST
Upcoming Bikes 2023: మేలో విడుదల కానున్న బైక్స్.. కేటీఎం, యమహా నుంచి కొత్త బైక్స్!

భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇంధన వాహనాలకు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా భారీ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ దృష్ట్యా వాహన సంస్థలు అన్ని ఎప్పటికప్పుడు సరికొత్త వాహనాలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే 2023 మేలో పలు కొత్త బైక్‌లు భారతీయ మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈ జాబితాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఏడీవీలు మరియు స్పోర్ట్స్ బైక్‌ల వరకు ఉంది. ఈ నెలలో భారత్‌లోకి రాబోతున్న కొత్త బైక్‌ల జాబితాను ఒకసారి చూద్దాం.

2023 KTM 390 Adventure:
కేటీఎం ఇటీవల 390 అడ్వెంచర్ యొక్క మరింత సరసమైన వెర్షన్‌ను విడుదల చేసింది. ఆ బైక్ పేరు 390 అడ్వెంచర్ X. దీని ధర రూ.2.80 లక్షలు. మేలో కంపెనీ తన అడ్జస్టబుల్ సస్పెన్షన్ మరియు స్పోక్ వీల్ వేరియంట్‌ను కూడా విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ తక్కువ సీటు ఎత్తును కలిగి ఉంటుంది. 

Yamaha R3 & MT-03:
యమహా కంపెనీ యమహా R3ని తిరిగి ఇండియాకు తీసుకువస్తోంది. అంతేకాదు MT-03 ను భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే రెండు యమహా బైక్‌లు 42 బిహెచ్‌పి మరియు 29 ఎన్ఎమ్ ఉత్పత్తి చేసే 321 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఇది భారతీయ మార్కెట్‌లో ఆసక్తికరమైన బైక్ అని చెప్పొచ్చు.

Triumph Street Triple 765:
ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 అనుకున్న విధంగా ఏప్రిల్‌లో ప్రారంభించబడలేదు. మే 2023లో ప్రారంభించవచ్చని తెలుస్తోంది. దీని కోసం ప్రీ-బుకింగ్ మార్చిలో రూ.50,000 టోకెన్ అమౌంట్‌తో ప్రారంభమైంది. 2023 ట్రయంఫ్ 765 శ్రేణి స్ట్రీట్ ట్రిపుల్ R మరియు RS వేరియంట్‌లను కలిగి ఉంటుంది.

TVS iQube ST:
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ నిరీక్షణ మేలో ముగియవచ్చు. ఈ బైక్ గత సంవత్సరం మేలో అనౌన్సమెంట్ అయింది. ఈ బైక్ 4.56 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 145 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో సింపుల్ ఎనర్జీ యొక్క 'వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్‌ అవనుంది. ఇది మే 23న విడుదల కానుంది.

Trending News