5G Services: ఎయిర్‌టెల్ 5జి సేవలు ఎప్పట్నించి ప్రారంభం, స్పీడ్ ఎంత ఉంటుంది
5G Services: దేశంలో 5జి ఇంటర్నెట్ సేవల కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఎయిర్‌టెల్ 5జి సేవల్ని ఎప్పట్నించి ప్రారంభిస్తుందనే విషయంలో స్పష్టత వచ్చింది. యూజర్లకు ఇప్పటికే మెస్సేజ్ లు కూడా అందాయి.
5G Services: దేశంలో 5జి ఇంటర్నెట్ సేవల కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఎయిర్‌టెల్ 5జి సేవల్ని ఎప్పట్నించి ప్రారంభిస్తుందనే విషయంలో స్పష్టత వచ్చింది. యూజర్లకు ఇప్పటికే మెస్సేజ్ లు కూడా అందాయి.
దేశంలో 5 జి సేవల కోసం చాలాకాలం నుంచి నిరీక్షణ ఉంది. ఎప్పట్నింటి లాంచ్ అవుతుంది, ధర ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దేశంలోని ప్రముఖ టెలీకం కంపెనీలైన ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, జియోలు 5జి స్పెక్ట్రమ్ వేలం పూర్తి చేశాయి. ఆ తరువాత ఒక్కొక్క కంపెనీ 5జి సేవల ప్రారంభం ఎప్పుడనే విషయంపై స్పష్టత ఇస్తున్నాయి. అదే విధంగా ఎయిర్‌టెల్ కూడా 5జి సేవల లాంచ్ డేట్ ప్రకటించింది.
ఎయిర్‌టెల్ 5జి సేవల విషయంలో కంపెనీ కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. సెప్టెంబర్ 2022లో 5జి సేవల్ని లాంచ్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని ఎయిర్‌టెల్ తెలిపింది. డిసెంబర్ వరకూ అన్ని ముఖ్యమైన మెట్రో నగరాల్లో ఎయిర్‌టెల్ 5జి సేవలు ప్రారంభమౌతాయని..2023 చివరికి దేశమంతా విస్తరిస్తాయని అంచనా వేస్తోంది.
ఎయిర్‌టెల్ స్పీడ్ ఎంత ఉంటుంది
ఎయిర్‌టెల్ 5జి సేవలు పొందాలంటే..యూజర్ల వద్ద కచ్చితంగా 5జి స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ఎయిర్‌టెల్ 5జి సేవలు పొందేందుకు కొత్త సిమ్ కార్డ్ అవసరం లేదని..స్మార్ట్‌పోన్ 5జి సపోర్ట్ చేసేది అయుండాలని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్ 5జి వేగం 4జితో పోలిస్తే..చాలా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. 5జి స్పీడ్..4జి స్పీడ్ కంటే 100 రెట్లు అధికంగా ఉంటుంది. లోబ్యాండ్ 5జి..50 నుంచి 250 ఎంబీపీఎస్ స్పీడ్ వరకూ పనిచేస్తుంది. మిడ్ బ్యాండ్ 5జి..100 నుంచి 900 ఎంబీపీఎస్ స్పీడ్ వరకూ పనిచేయనుంది. ఇక హై బ్యాండ్ స్పీడ్ అనేది గిగాబైట్స్‌లో ఉంటుంది. స్పీడ్ ప్రస్తుతం 1.8 జీబీపీఎస్ స్పీడ్ పరీక్షల్లో తేలింది.
Also read: Earn Money: ఏ పనిచేయకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా... అయితే ఇతని ఫార్ములా ఫాలో అవండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook