Earn Money Without Doing Anything: డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాలి. కానీ ఏ పని చేయకుండా డబ్బు సంపాదించడం సాధ్యమేనా.. తనకు సాధ్యమైందంటున్నాడు జపాన్‌లోని టోక్యోకి చెందిన 38 ఏళ్ల షోజీ మొరిమోటో. ఏ పని చేయకుండానే అతను భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇందుకోసం అతను ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టోక్యోలో నివసించే షోజీ మొరిమోటో గతంలో ఒక ప్రచురణ సంస్థలో పనిచేసేవాడు. కారణాలు తెలియదు కానీ కొన్నేళ్ల క్రితం అక్కడ జాబ్ మానేశాడు. అప్పటినుంచి డబ్బు సంపాదనకు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే.. కంపానియషన్‌షిప్. సింపుల్‌గా చెప్పాలంటే... ఎవరికైనా తోడుగా ఉండటం. అది ఇంటి పనిలో కావొచ్చు, వంట పనిలో కావొచ్చు, షాపింగ్‌లో కావొచ్చు.. ఇలా రకరకాలు. ఆ సమయానికి ఒక స్నేహితుడిలా వెంట ఉండి సహకరించడమే కంపానియన్‌షిప్ ముఖ్య ఉద్దేశం.
ఒకరకంగా ఇది తనను తాను అద్దెకు ఇచ్చుకోవడమని చెబుతున్నాడు షోజీ. ఇందుకోసం గంటకు రూ.5679 (10,000 యెన్) చొప్పున తీసుకుంటున్నట్లు తెలిపాడు. గడిచిన నాలుగేళ్లలో కంపానియన్‌షిప్ ద్వారా 4 వేల సెషన్లలో పాల్గొన్నట్లు షోజీ తెలిపాడు. అంటే.. వివిధ వ్యక్తులకు వివిధ సందర్భాల్లో 4 వేల సార్లు వారితో ఒక స్నేహితుడిలా గడిపాడు.
తనను సంప్రదించే క్లయింట్స్‌లో పావు వంతు తన ట్విట్టర్ ఫాలోవర్సే ఉంటారని షోజీ వెల్లడించాడు. ట్విట్టర్‌లో తనకు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు చెప్పాడు. ఇప్పటివరకూ అత్యధికంగా ఒకే వ్యక్తికి 270 సార్లు కంపానియన్‌షిప్ ఇచ్చినట్లు తెలిపాడు. రోజుకు ఒకరు లేదా ఇద్దరు క్లయింట్స్‌కి తాను సర్వీస్ ఇస్తానని.. కరోనాకు ముందు ముగ్గురి నుంచి నలుగురు క్లయింట్స్‌కి సర్వీస్ ఇచ్చేవాడినని చెప్పాడు. వ్యక్తిగత సాయం నుంచి ఇంటి పని వరకు చాలా పనులు చేసి పెడుతానని చెప్పుకొచ్చాడు.
Also Read: AP CABINET: కేబినేట్ లో మార్పుల దిశగా సీఎం జగన్.. వేటు పడే మంత్రులు వీళ్లేనా?
Also Read: NEET 2022 Results: నీట్ 2022 ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి ఐదో ర్యాంకు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook