7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, 18 నెలల డీఏ, ఒక్కొక్కరికి 2 లక్షలపైనే
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త లభించనుంది. 18 నెలల డీఏ ఎరియర్స్‌పై మార్గం సుగమం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త లభించనుంది. 18 నెలల డీఏ ఎరియర్స్‌పై మార్గం సుగమం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే డీఏ 4 శాతం పెరగడమే కాకుండా మూడు నెలల ఎరియర్స్ అందాయి. ఇదే డీఏ విషయంలో ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ విననున్నారు. ఈసారి ఏకంగా 18 నెలల డీఏ ఎరియర్స్‌పై నిర్ణయం త్వరలోనే వెలువడనుంది.
వాస్తవానికి సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న ఈ విషయాన్ని పరిష్కరించాల్సిందిగా పెన్షనర్లు ప్రధాని మోదీని ఇప్పటికే కోరారు. పెన్షనర్ల సమాఖ్య ఈ విషయమై ఇప్పటికే ఓ విజ్ఞాపన కూడా ప్రధాని మోదీకు అందించారు. త్వరలోనే డీఏ బకాయిలపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ప్రధాని సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా డబ్బులు అందనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా 18 నెలల డీఏ ఎరియర్స్ విషయంలో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డీఏ ఎరియర్స్ బకాయిలు లభిస్తే..పెద్దమొత్తంలో డబ్బులు అందనున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జేసీఎం అందించిన వివరాల ప్రకారం..లెవెల్ 1 ఉద్యోగులకు డీఏ ఎరియర్స్ 11,880 రూపాయల్నించి 37,554 రూపాయల వరకూ ఉండవచ్చు. అదే లెవెల్ 14 , లెవెల్ 13 ఉద్యోగులకు డీఏ ఎరియర్స్ 1,44,200 రూపాయల్నించి 2,18,200 రూపాయలవరకు ఉండవచ్చు.
18 నెలల ఎరియర్స్ బకాయిలంటే పెద్ద మొత్తమని..వారి జీవితానికి చాలా ఉపయోగకరమని పెన్షనర్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో డీఏ బకాయిలు చెల్లించాలంటున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 మే నుంచి 2021 జూన్ వరకు డీఏ పెంపు అనేది అమలు కాలేదు. ఆ తరువాత 2021 జూలై 1 నుంచి డీఏను పునరుద్ధరించారు. ఇప్పుడు ఆ నిలిచిపోయిన కాలానికి సంబంధించి డీఏ బకాయిలు కోరుతున్నారు.
18 నెలల డీఏ బకాయిలపై నిర్ణయం ఎప్పుడు
కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం జూలై 1, 202 నుంచి కరవు భత్యాన్ని ఒకేసారి 11 శాతానికి పెంచింది. కానీ ఆ సమయంలో డీఏ ఎరియర్స్ ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఈ విషయమై గత ఏడాది ఫ్రీజు చేసిన కాలంలో కరవు భత్యం చెల్లించరని ఆర్ధిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పుడు తాజాగా డీఏను 34 నుంచి 38 శాతానికి పెంచారు.
పెన్షనర్ల లాజిక్ ఏంటి
జనవరి 1, 2022 నుంచి జూన్ 30, 2021 మధ్య నిలిచిపోయిన పెరిగిన డీఏ ఎరియర్స్ ఇవ్వాలని పెన్షనర్లు ఆర్ధిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. డీఏ నిలిచిపోయిన కాలంలో ద్రవ్యోల్బణం చాలా వేగంగా పెరిగిపోయిందని..పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు, వంట నూనెల ధరలు భారీగా పెరిగినందున నిలిచిపోయిన ఎరియర్స్ చెల్లించాలనేది పెన్షనర్ల వాదనగా ఉంది.
నిలిచిపోయిన డీఏ బకాయిలు ఒకవేళ చెల్లిస్తే..పెద్దమొత్తంలో డబ్బులు అందనున్నాయి. ఈ మొత్తం తమ జీవితానికి చాలా అవసరమంటున్నారు పెన్షనర్లు. 18 నెలల సమయంలో ఖర్చులు, అవసరాలు పెరిగినా డీఏ మాత్రం పెరగలేదన్నారు. అందుకే డీఏ బకాయిలు ఆపడం మంచిది కాదంటున్నారు.
Also read: IPO News: కేవలం 14 వేల పెట్టుబడి, కొద్దిరోజుల్లోనే రెట్టింపయ్యే అవకాశం, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook