7th Pay Commission Latest News: కొత్త ఏడాదిలో ఉద్యోగులకు శుభవార్తలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. 2023 సంవత్సరం ప్రారంభంలోనే కీలక నిర్ణయం తీసుకునేదిశగా అడుగులు వేస్తోంది. జనవరి నెలలో డీఏపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం బహుమతిగా ఇవ్వవచ్చని అంటున్నారు. అంతేకాకుండా పెండింగ్ డీఏ, పాత పెన్షన్ స్కీమ్‌పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డియర్‌నెస్ అలవెన్స్ పెంపు, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, ప్రమోషన్ తర్వాత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా వచ్చే ఏడాది చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతం రూ.8 వేలు నేరుగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచడం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద కనీస వేతనం రూ.18 వేలు లభిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2023న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తర్వాత కేంద్ర ఉద్యోగుల ఈ డిమాండ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. 


కరువు భత్యం మళ్లీ పెరుగుతుంది


కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రతి 6 నెలలకోసారి సమీక్షిస్తుంది. AICPI డేటా ఆధారంగా.. డియర్‌నెస్ అలవెన్స్ సంవత్సరానికి రెండుసార్లు పెంచుతోంది. ఈ పెరుగుదల జనవరి, జూలైలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023లో కూడా కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌లో పెరుగుదల ఉంటుంది. జనవరి 2023కి సంబంధించిన డియర్‌నెస్ అలవెన్స్ మార్చిలోపు ప్రకటించనుంది. ఇప్పటి వరకు ఉన్న ద్రవ్యోల్బణం గణాంకాలను పరిశీలిస్తే వచ్చే ఏడాది కూడా 4 శాతం డీఏ పెంపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబరు, నవంబర్, డిసెంబర్‌ల ఏఐసీపీఐ ఇండెక్స్ నంబర్లు ఇంకా విడుదల కాలేదు.


Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత యూటర్న్.. రేపు సీబీఐ విచారణకు రాలేను  


Also Read: Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి