Four Ayyappa Devotees Killed In Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వేమూరు మండలం జంపని దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 16 మంది గాయపడ్డారు. మృతులు కృష్ణా జిల్లా వాసులుగా గుర్తించారు. వివరాలు ఇలా..
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నిలపూడి గ్రామానికి చెందిన భక్తులు శబరిమల నుంచి రైలులో వచ్చి.. తెనాలి రైల్వే స్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి టాటా ఏస్‌లో మొత్తం 22 మంది సొంతూరికి బయలుదేరగా.. వేమూరు మండలం జంపని వద్ద టాటా ఏస్ ఆటో బోల్తాపడింది. మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
మృతులను బొల్లిశెట్టి పాండురంగారావు, బుద్దాన పవన్ కుమార్, బార్డటి రమేష్, పాశం రమేష్‌లుగా గుర్తించారు. మరో మందికి గాయలవ్వగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లి.. సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే అనుకోకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నిలపూడి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కాగా.. నవంబర్ 19న ఏపీ నుంచి యాత్రికులతో శబరిమలకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పతనంతిట్ట సమీపంలో బస్సలో లోయలో పడిపోగా.. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కిందపడింది. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ఉన్నారు. నవంబర్ 27న ఒంగోలులో 32 మంది అయ్యప్ప భక్తులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అనకాపల్లిజిల్లా డీఎల్ పురం గ్రామానికి చెందిన అయ్యప్పభక్తులు.. ఓ ప్రైవేట్ బస్సులో శబరిమలకు బయలుదేరి వెళ్లగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.
Also Read: Mlc Kavitha: సీబీఐ నుంచి నో రిప్లై.. ట్విస్ట్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ కవిత..?
Also Read: Gujarat Election 2022: నేడే గుజరాత్‌లో రెండో దశ పోలింగ్.. ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు వేసేది ఇక్కడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి