7th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించింది. కరవు భత్యంను ఈసారి ఏకంగా 8 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నది గుజరాత్ ప్రభుత్వం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచింది. 4 శాతం డీఏ పెంచడం ద్వారా 42 శాతానికి చేరుకుంది. జననరి 1, 2023 నుంచి కొత్త డీఏ అంటే మొత్తం 42 శాతం అమలుకానుంది. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా గుజరాత్ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు డీఏను జనవరి 1 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం 9.5 లక్షల పెన్షనర్లు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు పర్యాయాలుగా చేయాల్సిన డీఏ పెంపును ఒకేసారి చేసింది.


కరవుభత్యం 8 శాతం పెంపును రెండు భాగాలుగా ప్రభుత్వం విభజించింది. మొదటిది 1 జూలై, 2022 నుంచి 4 శాతం కాగా రెండవది 1 జనవరి 2023 నుంచి మరో 4 శాతం. రెండింటినీ కలిపి ఒకేసారి 8 శాతం ప్రకటించినా..అమలయ్యేది మాత్రం నిర్ణీత వ్యవధి నుంచే .


కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన తరువాత తమిళనాడు ప్రభుత్వం కూడా డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 7వ వేతన సంఘం ప్రకారం డీఏను 4 శాతం పెంచింది. అటు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా 3 శాతం డీఏ పెంచగా రాజస్థాన్, అస్సోం రాష్ట్రాలు కూడా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నాయి.


Also read: NPS Plans: నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్ మంచిదో ఎలా తెలుసుకోవడం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebool