7th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్, 18 నెలల డీఏ బకాయిలపై త్వరలో నిర్ణయం
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షన్‌దారులు చాలాకాలంగా డీఏ కోసం నిరీక్షిస్తున్నారు. హోలీ తరువాత 18 నెలల డీఏపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. అంటే ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు అందనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కోవిడ్ సమయంలో డీఏ లభించలేదు. మొత్తం 18 నెలల డీఏ బకాయి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు చెల్లించాల్సిన 18 నెలల డీఏపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే..48 లక్షల ఉద్యోగులు, 68 లక్షల పెన్షన్‌దారులకు పెద్దమొత్తంలో లాభం కలగనుంది.
మీడియా నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హోలీ తరువాత శుభవార్త వినవచ్చు. అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు డీఏ బకాయిల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో మొత్తం 18 నెలల డీఏ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడింది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకూ చెల్లించాల్సిన బకాయిలు ఇవి. ఉద్యోగుల హక్కైన డీఏపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ చెల్లించాల్సి ఉంది.
బకాయిల రూపంలో 2 లక్షల 18 వేల రూపాయలు
ఈ డీఏతో లెవెల్ 13 అధికారులకు 1,23100 రూపాయల నుంచి 2,15,900 రూపాయలు లభిస్తాయి. అటు లెవెల్ 14 ఉద్యోగులకు డీఏ ఎరియర్లు 1,44,200 రూపాయల్నించి 2,18,200 రూపాయలు లభిస్తాయి. హోలీ నాడు కేంద్ర ప్రభుత్వం 48 ఉద్యోగులు, 68 లక్షల కంటే ఎక్కువ పెన్షనర్లకు లాభం కలగనుంది.
Also read: Post office Scheme: ఈ పథకంలో ఒకసారి పెట్టుబడితో ప్రతి నెలా 9 వేల రూపాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook