Post office Scheme: ఈ పథకంలో ఒకసారి పెట్టుబడితో ప్రతి నెలా 9 వేల రూపాయలు

Post office Scheme: పెట్టుబడి పేరుతో చాలామంది లక్షలాది రూపాయలు నష్టపోతుంటారు. ఈ పరిస్థితుల్లో ఏ విధమైన టెన్షన్ లేకుండా ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 9 వేలు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 12, 2023, 08:05 AM IST
Post office Scheme: ఈ పథకంలో  ఒకసారి పెట్టుబడితో ప్రతి నెలా 9 వేల రూపాయలు

ఒకవేళ మీరు ప్రతి నెలా నిర్ధిష్టమైన ఆదాయం సంపాదించుకోవాలనుకుంటే..ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ అంటే రిటర్న్ గ్యారంటీనే. ప్రైవేట్‌రంగంలో ఇన్వెస్ట్ చేయడం ఎంత రిస్క్ అనేది అందరికీ తెలిసిందే. అందుకే ఈ ప్రభుత్వ పథకం సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ పథకం..

ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ప్రతి నెలా 1వ తేదీన కచ్చితంగా 9 వేల రూపాయలు మీ బ్యాంకు ఎక్కౌంట్‌లో పడిపోతాయి. ఈ ప్రభుత్వ పథకం పేరు పోస్ట్ ఆఫీసు మంత్లీ సేవింగ్ స్కీమ్. ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే..సమీపంలోని పోస్టాఫీసులో సంప్రదించాలి. 

సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్‌లో వడ్డీ రేటు బాగుంటుంది. ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా వడ్డీ రూపంలో డబ్బులు లభిస్తాయి. జనవరి-మార్చ్ 2023 కోసం వడ్డీ రేటు 7.1 శాతంగా నిర్ధారించారు. ఈ వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఈ పథకంలో లాక్ ఇన్ పీరియడ్ 5 ఏళ్లుంటుంది. మెచ్యూరిటీ తరువాత ఇన్వెస్టర్‌కు రెండు ఆప్షన్స్ ఉంటాయి.  ఈ డబ్బులు డ్రా చేయడం లేదా ఇదే పథకంలో రెండవసారి ఇన్వెస్ట్‌ చేయడం. ఇటీవలే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..బడ్జెట్ ప్రసంగంలో ఈ స్కీమ్‌లో పెట్టుబడిని 4.5 లక్షల నుంచి 9 లక్షల వరకూ పెంచుతున్నట్టు ప్రకటించారు. అదే జాయింట్ ఎక్కౌంట్ అయితే 15 లక్షల రూపాయలుంటుంది. 

ప్రతి నెలా 9 వేల రూపాయలు

ఈ పథకంలో పెట్టుబడి పరిమితి పెరిగింది. దాంతో జాయింట్ ఎక్కౌంట్ ద్వారా ఈ పథకంలో 15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ మీరు 15 లక్,లు పెట్టుబడి పెడితే..మీకు వడ్డీ కింద నెలకు 9 వేల రూపాయలు లభిస్తాయి. జాయింట్ ఎక్కౌంట్ హోల్డర్లకు మీ పెట్టుబడికి తగ్గట్టుగా వడ్డీ చెల్లింపు ఉంటుంది. ఈ వడ్డీని నెలకోసారి లెక్కించి ఇస్తారు. మెచ్యూరిటీ పూర్తయ్యేంతవరకూ వడ్డీ ప్రతి నెలా లభిస్తుంది. సింగిల్ ఎక్కౌంట్ హోల్డర్ 9 లక్షలు పెట్టుబడి పెడితే..నెలకు 5,325 రూపాయలు వడ్డీ లభిస్తుంది. 

Also read: ATM Alerts: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త, లేకపోతే మీ డబ్బులు పోయినట్టే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News