7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ట్రావెలింగ్ విషయంలో కొత్త నియమాలు
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్. ఇప్పటికే డీఏ 4 శాతం పెరగడంతో పాటు ట్రావెలింగ్ విషయంలో కొత్త వెసులుబాటు వచ్చి చేరింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్. ఇప్పటికే డీఏ 4 శాతం పెరగడంతో పాటు ట్రావెలింగ్ విషయంలో కొత్త వెసులుబాటు వచ్చి చేరింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరగడం దాదాపుగా ఖరారైంది. సెప్టెంబర్ 28వ తేదీన కొత్త డీఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. మరోవైపు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలల డీఏ ఎరియర్స్ సెప్టెంబర్ జీతంతో రానున్నాయని అంచనా. అంటే దసరా పండుగ నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డబ్బులు అందనున్నాయి. దీనిపై కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన లేకపోయినా దాదాపుగా ఖరారైంది.
ఇప్పుడు మరో శుభవార్త విన్పించింది కేంద్ర ప్రభుత్వం. కొత్త నియమాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు..టూర్, ట్రైనింగ్, ట్రాన్స్‌ఫర్, రిటైర్‌మెంట్‌పై తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించగలరు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణమంటే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రయాణంతో సమానం.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ తరపు నుంచి సెప్టెంబర్ 12, 2022న ఆఫీస్ మెమొరాండమ్ జారీ అయింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తేజస్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణించేందుకు అనుమతి లభించింది. అంటే టూర్, ట్రైనింగ్, ట్రాన్స్‌ఫర్, రిటైర్‌మెంట్ సందర్భాల్లో తేజస్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణించగలరు. 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం ట్రావెలింగ్ అలవెన్స్ నియమాలు 2016లో రూపొందించారు.
టికెట్ రీయింబర్స్‌మెంట్‌కు అనుమతి
2017లో జారీ చేసిన ఆఫీస్ మెమొరాండమ్ ప్రకారం ప్రీమియం రైళ్లు, ప్రీమియం తత్కాల్ రైళ్లు, లగ్జరీ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా..ప్రీమియం తత్కాల్ ఛార్జ్, అధికారిక పర్యటనల్లో శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ప్రయాణిస్తే టికెట్ రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు ఆమోదం లభించింది.
ఎవరికి ఏ తరగతిలో ప్రయాణించేందుకు అనుమతి
పే మ్యాట్రిక్స్‌లో పే లెవెల్ 12, అంతకంటే ఎక్కువైతే.. ఎగ్జిక్యూటివ్, ఏసీ ఫస్ట్ క్లాస్, ప్రీమియం తత్కాల్, లగ్జరీ, శతాబ్దీ, రాజధాని రైళ్లు.
పే మ్యాట్రిక్స్‌లో పే లెవెల్ 6 అంతకంటే ఎక్కువైతే..ఏసీ సెకండ్ క్లాస్, ఛైర్ కార్
పే మ్యాట్రిక్స్‌లో పే లెవెల్ 5 అంతకంటే ఎక్కువైతే..ఏసీ థర్డ్ క్లాస్, ఛైర్ కార్
Also read: LIC Saral Pension Yojana: సింగిల్ ప్రీమియం చెల్లిస్తే..జీవితాంతం నెలకు 50 వేల రూపాయల పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook