E-Aadhaar Card Download: ఆధార్ నెంబర్ లేకున్నా.. ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా
E-Aadhaar Card Download Without Aadhaar Number: ఒకవేళ మీ ఆధార్ కార్డు పోతే అప్పుడు పరిస్థితి ఏంటి ? కనీసం మీ ఆధార్ నెంబర్ కూడా మీ వద్ద లేదనుకోండి.. అప్పుడు ఏం చేస్తారు ? ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురైందా.. కంగారుపడకండి.. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉన్నట్టుగానే.. ఈ సమస్యకు కూడా ఒక మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
E-Aadhaar Card Download Without Aadhaar Number : ఆధార్ కార్డు లేనిదే ఇప్పుడు ఏ పని కూడా అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాలం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా.. కనీసం బ్యాంకులో సేవింగ్స్ ఎకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాల్సిందే. చివరకు మొబైల్ సిమ్ కార్డు కూడా ఆధార్ ఆధారంగానే ఇవ్వడం అనేది ఎప్పుడో తప్పనిసరి అయిపోయింది. అందుకే మన నిత్య జీవితంలో ఆధార్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
మరి ఒకవేళ మీ ఆధార్ కార్డు పోతే అప్పుడు పరిస్థితి ఏంటి ? కనీసం మీ ఆధార్ నెంబర్ కూడా మీ వద్ద లేదనుకోండి.. అప్పుడు ఏం చేస్తారు ? ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురైందా.. కంగారుపడకండి.. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉన్నట్టుగానే.. ఈ సమస్యకు కూడా ఒక మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఆధార్ కార్డు నెంబర్ లేనప్పటికీ.. మీ ఫోన్‌లో మీరే ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుదారులు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవడం ద్వారా ఈ పనిని సులువుగా పూర్తి చేసుకోవచ్చు. సాధారణంగా అయితే, ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా కానీ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడి ఆధారంగా కానీ ఈ-ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుంటారు. అయితే, ఒకవేళ మీ వద్ద ఈ రెండూ లేకున్నప్పటికీ.. ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుుకు అవకాశం ఉంది. అదెలాగో చూద్దాం.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడి నెంబర్‌ను తెలుసుకోండిలా
ఎన్‌రోల్‌మెంట్ ఐడి నెంబర్‌ని తెలుసుకోవాలంటే, ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగాన్ అవ్వాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్లో ' గెట్ ఆధార్ ' వే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత ' ఎన్‌రోల్‌మెంట్ ఐడి రిట్రైవ్ ' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత, వెబ్‌సైట్లో అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేసి సెండ్ ఓటిపి అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటిపిని ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
ఓటిపిని సబ్మిట్ చేయడంతోనే మీ స్క్రీన్‌పై మీ ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ ఐడి నెంబర్‌ను కనిపిస్తుంది.
ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ ఐడి మీ వద్ద ఉంది. ఇక ఆధార్ నెంబర్ లేకుండా ఇ-ఆధార్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ-ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి, ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో 'డౌన్‌లోడ్ ఆధార్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ నమోదు ఎన్‌రోల్‌మెంట్ ఐడిని ఎంటర్ చేయండి.
తర్వాతి దశలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, సెండ్ ఓటిపి బటన్‌పై క్లిక్ చేయండి.
మీరు ఓటిపి నెంబర్‌ని ఎంటర్ చేసిన వెంటనే మీ ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Old Vehicles Seizing: ఆ నెంబర్ సిరీస్ వాహనం కనిపిస్తే చాలు సీజ్.. ఇప్పటికే 800 వాహనాలు సీజ్
ఇది కూడా చదవండి : Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ?
ఇది కూడా చదవండి : LPG cylinder price hike: హైదరాబాద్‌లోనే ఎల్పీజీ సిలిండర్ ధర ఎక్కువ !
ఇది కూడా చదవండి : Home Loan EMIs: ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook