What is Blue Aadhaar Card: ప్రస్తుతం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వ రాయితీల నుంచి సంక్షేమ పథకాల వరకు.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వరకు అన్నింటికి ఆధార్ తప్పసరిగా కావాల్సిందే. కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటే ఆధార్ కంపల్సరీ. మన పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీతో సహా అన్ని వివరాలు ఆధార్‌లో ఉంటాయి. 12 అంకెల ఆధార్‌ నంబరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018లో బ్లూ ఆధార్ కార్డ్ (బాల్ ఆధార్)ను ప్రవేశపెట్టింది. ఇది 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో చిన్న పిల్లలను చేర్చడంలో బ్లూ ఆధార్ కార్డుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆధార్ కార్డు ఉంటే.. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బయోమెట్రిక్ డేటాను అందించాల్సిన అవసరం లేదు. బదులుగా.. వారి యూఐడీ (ప్రత్యేక గుర్తింపు) జనాభా డేటా, వారి తల్లిదండ్రుల యూఐడీకి లింక్ చేసిన ముఖ చిత్రాన్ని ఉపయోగించి ప్రాసెస్ చేయవచ్చు.


బ్లూ ఆధార్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?


==> ఆధార్ అధికారిక వెబ్‌సైట్ UIDAI uidai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
==> మీ నామినేషన్ ఫారమ్‌లో వివరాలను పూరించండి.
==> రిజిస్ట్రేషన్ కోసం అపాయింట్‌మెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> సమీపంలోని నమోదు కేంద్రాన్ని చూసుకుని.. అక్కడ అపాయింట్‌మెంట్ తీసుకోండి.
==> తల్లిదండ్రుల ఆధార్, పిల్లల జనన ధృవీకరణ పత్రం, రిఫరెన్స్ నంబర్ మొదలైనవాటిని ఆధార్ కేంద్రానికి తీసుకు వెళ్లండి
==> అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత.. స్టాటస్‌ను ట్రాక్ చేయడానికి రసీదు సంఖ్యను పొందండి.
==> ఆ నంబరు ఆధారంగా తరువాత ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


Also Read: TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి