ఫారన్లో కొత్త పాలసీ... ఎన్ని రోజులు కాలంటే అన్ని రోజులు సెలువులు ఇస్తున్న ఐటీ కంపెనీలు.
న్యూజిల్యాండ్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ `యాక్షన్ స్టెప్` ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని అన్వేషించింది. కొత్త వర్క్ కల్చర్‌ను తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకు మనకు హైబ్రిడ్ వర్క్ కల్చర్, వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే తెలిస్తే.... `హైట్రస్ట్ మోడల్` వర్క్ కల్చర్‌ను అమలులోకి తీసుకొచ్చింది.
కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోంకు బాగా అలవాటు పడ్డ ఉద్యోగులకు మళ్లీ ఆఫీసులకు వెళ్లాలంటే మనసు రావడం లేదు. కాని కార్పోరేట్ కంపెనీలు మాత్రం ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే అని తేల్చిచెప్తున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే ఆఫీసు బాట పడుతున్నారు. మన దగ్గర అయితే ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఇంకా వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. అయితే కరోనా కారణంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ఐటీ కంపెనీలను అట్రిషన్ రేటుతో పాటు, గ్రేట్ రిజిగ్నేషన్ కలవర పెడుతున్నాయి. దీంతో ఉద్యోగులను సంతృప్తి పర్చడానికి కొత్త వర్క్ పాలసీలను తీసుకురావడంతో పాటు , భారీ ప్యాకేజీలిచ్చేందుకు సైతం ఐటీ కంపెనీలు వెనుకాడడం లేదు.
కరోనా కారణంగా ఎన్నో రంగాలు కుదేలు అయినప్పటికీ ఒక్క ఐటీ రంగం మాత్రం ఈ బారిన పడలేదు. ఉద్యోగులు వర్క్ ఫ్రం ద్వారా పనులు చక్కబెట్టడంతో పెద్ద ఇబ్బంది లేకుండా గండం గట్టెక్కింది. వర్క్ ఫ్రం హోం కారణంగా ఐటీ కంపెనీలకు ఆఫీసు ఖర్చులు తగ్గడంతో పాటు ఉద్యోగుల నుంచి కూడా ఉత్పత్తి పెరిగింది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంటి నుంచే పని చేసేందుకు గత కొంత కాలంగా బాగా అలవాటు పడ్డ ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు రమ్మండే మొహం చాటేస్తున్నారు.
దీంతో న్యూజిల్యాండ్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ 'యాక్షన్ స్టెప్' ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని అన్వేషించింది. కొత్త వర్క్ కల్చర్‌ను తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకు మనకు హైబ్రిడ్ వర్క్ కల్చర్, వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే తెలిస్తే.... 'హైట్రస్ట్ మోడల్' వర్క్ కల్చర్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వర్క్ పాలసీ ద్వారా ఇకపై ఉద్యోగులు సంవత్సరంలో ఎన్ని సెలవులు కావాలను అన్ని రోజులు మాత్రమే పని చేసే వెసులుబాటు కల్పించింది. డబ్బుపై అంత మోజు లేని అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఉద్యోగులు ఈ కొత్త పాలసీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగులు సెలవులు తీసుకోవడం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి ఉత్పత్తి పెరుగుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఈ కొత్త పాలసీని అమలు చేస్తోంది యాక్షన్ స్టెప్. ఈ కొత్త పాలసీ ద్వారా సంస్థ ఖర్చు చేసే ప్రతీ పైసాకు తగ్గ ప్రొడక్టివిటీ వస్తోందని సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు అంటే అన్ని సెలవులు ఇస్తున్నప్పటకీ నాలుగు వారాల కంటే ఎక్కువ సెలువులు తీసుకోవద్దని ఉద్యోగులను రిక్వెస్ట్ చేస్తోంది. అదే సమయంలో డబ్బు అవసరం బాగా ఉన్న వాళ్లు మాత్రం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పనిచేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
also read Wipro profits increase లాభాల పంట పండిస్తున్న విప్రో... 10.4 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు
also read ఐడీబీఐ బ్యాంకును అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.