Wipro profits increase భారతీయ ఐటీ దిగ్గజం లాభాల పంట పండిస్తోంది. కిందటి ఏడాది ఆదాయంతో పోల్చితే ఈ సారి గణనీయమైన పురోభివృద్ధి నమోదు చేసింది. లాభార్జనలో మొట్టమొదటిసారిగా పది బిలియన్ డాలర్ల రికార్డును నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియర్రీ డెలాపోర్టే ప్రకటించారు. కిందటి ఏడాదితో పోల్చితే ఈసారి తమ ఆదాయంలో ఏకంగా 27 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. ఐటీ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని చెప్పారు. విప్రో ఖ్యాతిని దశదిశలు వ్యాప్తి చేయాలన్న ఉద్యోగుల అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమ, సంస్థ ఎదుగుదలపై వారికి ఉన్న చిత్తశుద్ధి కారణంగా ఇంత సంపదను పోగు చేసుకోగలిగామని చెప్పారు. అందుకే ఉద్యోగుల జీతాలు ఒకే ఏడాది రెండు సార్లు పెంచినట్లు వెల్లడించారు. 80 శాతం ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించినట్లు తెలిపారు.
మార్చితో ముగిసే త్రైమాసికం నికరలాభంలో 4 శాతం వృద్ధి నమోదు అయిందని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియర్రీ డెలాపోర్టే చెప్పారు. రూ. 3,047.3 కోట్ల నికర లాభాన్ని విప్రో ఆర్జించిందని చెప్పారు. నిపుణుల నియామకంతోనే ప్రగతి నమోదు అయిందని సంస్థ ప్రకటించారు. ఉద్యోగుల పని తీరుతో బలమైన ప్రగతి నమోదు అయిందని వెల్లడించారు. తద్వారా మరిన్ని ఆర్డర్లు అందుకున్నట్లు చెప్పారు. లాభాల పంట పండడంతో లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాప్కో కంపెనీని విప్రో 1.45 బిలియన్ డాలర్లకు ఈ సంవత్సరం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. విప్రో చరిత్రలోనే ఇదొక మైలు రాయిని అని చెప్పారు. ముగిసిన త్రైమాసికంలో 100 మిలియన్ డాలర్లకుపైగా ఆదాయాన్నిచ్చే ఇద్దరు కొత్త క్లయింట్లు, 50 మిలియన్లకుపైగా ఆదాయం అందించే ముగ్గురు కొత్త క్లయింట్లు విప్రోకు లభించారని వెల్లడించారు. కొత్త క్లయింట్ల రాకతో లాభాలు పెరిగాయని చెప్పారు. దీనికి తోడు గత ఆర్థిక సంవత్సరంలో విప్రో దాదాపు రూ.17,602 కోట్ల విలువైన 37 పెద్ద ఆర్డర్లను దక్కించుకుందని వెల్లడించారు.
కిందట ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 45,416 మంది ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. వీరి రాకతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.43 లక్షలకు పెరిగిందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 45 వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. పలువురు జూనియర్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే సంస్థలో పనిచేసే ఉద్యోగులు శాలరీ హైక్ కోసం ఇతర సంస్థల్లో చేరవడం వల్ల చాలా ఖాళీలు అయ్యాయని చెప్పారు. వీటిని భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ ప్రాసెస్ వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ఉద్యోగుల్లో అధికంగా ప్రెషర్స్ ఉన్నందున, సిబ్బంది నికర వినియోగం రేటు 85.8 శాతం నుంచి 85.2 శాతానికి తగ్గిందని విప్రో వెల్లడించింది.
also read ఐడీబీఐ బ్యాంకును అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ ,
alsor read Xiaomi 5A Smart TV: స్మార్ట్ టీవీ లాంఛింగ్ ఆఫర్.. రూ.2,499 ధరకే కొనొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.