Cheap Flight Tickets: ఎయిర్ ఇండియా ఫ్లాష్ సేల్, కేవలం 1444 రూపాయలకే ఫ్లైట్ టికెట్
Cheap Flight Tickets: దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యంత చౌక ధరకే విమానయానం చేయవచ్చు. కేవలం 16 వందలకే దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cheap Flight Tickets: ప్రయాణీకులకు అత్యంత చౌకగా విమానయానం అందించేందుకు ఎయిర్ ఇండియా మరోసారి ఫ్లాష్ సేల్ ప్రారంభించింది. ప్రస్తుతం బుకింగ్స్ నడుస్తున్నాయి. నవంబర్ 13 అంటే రేపటి వరకూ ఈ సేల్ అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ప్రయాణం చేయవచ్చు.
ఎయిర్ ఇండియా ఫ్లాష్ సేల్ ప్రస్తుతం నడుస్తోంది. నవంబర్ 13 అంటే రేపటి వరకూ ఈ ఫ్లాష్ సేల్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకూ ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. అంటే రానున్న ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటే కేవలం 1599 రూపాయలకే విమానయానం చేసే అద్భుతమైన అవకాశం కలుగుతుంది. కొన్ని రూట్లలో అయితే ఇంకా చౌక ధరకే టికెట్ లభిస్తుంది. ఎయిర్ ఇండియా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్‌లో భాగంగా అదనపు డిస్కౌంట్ 1444 రూపాయల నుంచి ప్రారంభమౌతుంది. అంతేకాకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ .కామ్‌లో లాగిన్ అయిన ప్రయాణికులకు జీరో కన్వీనియన్స్ ఉంటుంది.
ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్‌లో అదనంగా 3 కిలోల కేబిన్ లగేజ్ కోసం ప్రీ బుక్ చేసుకోవచ్చు. 15 కిలోలైతే 1000 రూపాయలకు చెకిన్ కావచ్చు. అదే అంతర్జాతీయ విమానాల్లో అయితే 20 కిలోల లగేజ్‌కు 1300 చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.కామ్‌లో లాయల్టీ సభ్యులకు ఎక్స్‌ప్రెస్ బిజినెస్ కేటగరీలో 25 శాతం డిస్కౌంట్ ఉంటుంది. బిజినెస్ కేటగరీ సీట్లు బోయింగ్ 737-8 ఎయిర్ క్రాఫ్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ డిస్కౌంట్లు కాకుండా విద్యార్ధులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్శులు ఆర్మీ సిబ్బందికి ప్రత్యేక రాయితీ ఉంటుంది.
Also read: Cyber Security: ఈ ఆరు పదాలు పొరపాటున కూడా గూగుల్ సెర్చ్ చేయొద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.