Cyber Security: ఈ ఆరు పదాలు పొరపాటున కూడా గూగుల్ సెర్చ్ చేయొద్దు

Cyber Security: మనం నిత్యం ప్రతి పనికీ గూగుల్‌ని ఆశ్రయిస్తుంటాం. ప్రతి రోజూ ఏదో ఒక అవసరం కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. ఈ క్రమంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుులు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. ఇప్పుడు బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ అదే హెచ్చరిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 12, 2024, 10:36 AM IST
Cyber Security: ఈ ఆరు పదాలు పొరపాటున కూడా గూగుల్ సెర్చ్ చేయొద్దు

Cyber Security: గూగుల్ సెర్చ్ అనేది నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ ఇలా ఏదో ఒకదాన్లోంచి గూగుల్ సెర్చ్ ద్వారా కావల్సిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ క్రమంలో కొన్ని పదాలు టైప్ చేస్తే కొంప కొల్లేరయిపోతుంది. మీ వ్యక్తిగత సమాచారం కాస్తా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. తస్మాత్ జాగ్రత్త. 

హ్యాకర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధాలుగా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీ సంస్థలు అదే పనిగా హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. ఇందులో భాగంగానే బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ ఓ కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. గూగుల్‌లో మీరు ఆ ఆరు పదాలు కలిపి టైప్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదంటోంది. మీ వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. ఆ పదాలేంటో తెలుసుకుందాం. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో పొరపాటున కూడా Are Bengal Cats Legal in Australia ? అని టైప్ చేసి గూగుల్ సెర్చ్ చేయవద్దని హెచ్చరిస్తోంది. ఈ పదాలు చాలా ప్రమాదకరమైన కాంబినేషన్ అంటోంది. మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కుతుందని వార్నింగ్ ఇస్తోంది.  ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు టైప్ చేసి సెర్చ్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం చోరీ అవుతుంది. ఇక ఇవే పదాలు కలిపి టైప్ చేస్తే టాప్ రిజల్ట్స్‌లో ఫేక్ లింక్స్ కన్పిస్తాయి. వీటిని క్లిక్ చేస్తే ప్రమాదకరమైన మాలిసియస్ యాడ్స్  రీడైరెక్ట్ అవుతాయి. 

ఇలాంటి ప్రమాదకర లింక్స్ క్లిక్ చేస్తే మీ డివైస్‌లో హిడెన్ మాల్‌వేర్ ప్రవేశిస్తుంది. ఆ తరువాత క్షణాల్లో గూట్ కిట్ అనే మరింత ప్రమాదకర ప్రోగ్రామ్ ఎంటర్ అవుతుంది. ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా చోరీ చేస్తుంది. అంతేకాకుండా ట్రోజాన్ అనే మాల్‌వేర్‌‌ను మీ డివైస్‌లో ఎక్కువకాలం ఉండేలా చేస్తుంది. 

Are Bengal Cats Legal in Australia ? ఈ వాక్యంలో ఆస్ట్రేలియా అనే పదం మరింత ప్రమాదకరమంటున్నారు. ఇది తెలియక టైప్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ క్లిక్ చేస్తే ఇక మొత్తం డివైస్ హ్యాకర్ చేతికి పోతుంది. మీ బ్యాంక్ సమాచారం హ్యాకర్ కు చేరిపోతుంది. అందుకే బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ మరీ మరీ హెచ్చరిస్తోంది. ఇదొక కొత్త రకమైన సైబర్ మోసమని నిపుణులు చెబుతున్నారు. ఈ పదాలు కలిపి టైప్ చేసినప్పుడు టాప్ రిజల్ట్స్ లో ప్రమాదకరమైన , హానికరమైన లింక్స్ వచ్చేలా హ్యాకర్లు సెట్ చేస్తున్నారు. 

Also read: EPF: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్‌ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్‌ ఛాన్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News