Airtel introduced Rs 118 Data Plan, Cheapest to Jio data plan of Rs 121: ప్రస్తుతం ఇంటర్నెట్ లేనిదే ఏదీ గడవడం లేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ వినియోగం మరింత ఎక్కువైంది. దీన్ని ఉపయోగించుకునేందుకు ప్రతి టెలికాం కంపెనీ చూస్తోంది. ఇటీవలి కాలంలో రీఛార్జ్, డేటా రేట్లను  ప్రతిఒక్క టెలికాం కంపెనీ పెంచాయి. సాధారణ రీఛార్జ్ రేట్లను పెంచిన ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్.. చీపెస్ట్ డేటా ప్లాన్‌ను తమ యూసర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ జియో కంటే తక్కువగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ.. రూ. 118 డేటా ప్లాన్ కాస్త ప్రత్యేకమైంది అని చెప్పాలి. ఈ ప్లాన్‌లో హై-స్పీడ్ డేటాను అందజేస్తుస్తుంది. రూ. 118 డేటా ప్లాన్‌లో 12 జీబీ వస్తుంది. ఇది డేటా ప్లాన్ కాబట్టి ఇతర ప్రయోజనాలు ఇందులో ఉండవు. మెయిన్ రీఛార్జ్ ప్లాన్‌ వాలిడిటీ ఉన్నంత వరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. రిలయన్స్ జియోలో 12 జీబీ కోసం రూ. 121 పెట్టాలి. ఎయిర్‌టెల్ ప్లాన్ లాగానే జియో ప్లాన్‌లో కూడా ఇతర ప్రయోజనాలు ఏమీ లేవు. 


ఎయిర్‌టెల్ మరో డేటా ప్లాన్‌ను కూడా తమ యూసర్లకు అందుబాటులో ఉంచింది. రూ. 108 రీఛార్జ్ ప్లాన్‌లో 6 జీబీ హై-స్పీడ్ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ మొబైల్ వెర్షన్ 30- రోజుల ట్రయల్, ఉచిత హలో ట్యూన్స్ యాక్సెస్ మరియు వింక్ మ్యూజిక్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్ యూసర్లు పొందవచ్చు. ఇది కూడా మీ ప్రస్తుత ప్లాన్‌ ఎండ్ అయ్యేవరకు ఉంటుంది. 


ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం రూ. 296, రూ. 319 రూపంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 296 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా.. రూ. 319 ప్లాన్ వ్యాలిడిటీ ఒక నెల. జియో మన దేశంలో రూ. 259 ప్లాన్‌ను లాంచ్ చేసిన అనంతరం ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను లాంచ్ చేయడం విశేషం. 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కనీసం ఒక్కటైనా అందుబాటులో ఉండాలని ట్రాయ్.. టెలికాం ఆపరేటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకే ఎయిర్‌టెల్ ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. 


Also Read: MS Dhoni Record: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఒకే ఒక్కడు!


Also Read: MS Dhoni Record: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఒకే ఒక్కడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.