Airtel Jio VI Prepaid Plans: టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా.. కస్టమర్స్ కోసం వివిధ ప్రీపెయిడ్ ప్లాన్స్‌‌ను అందిస్తున్నాయి. వీటిల్లో ప్రత్యేకించి డేటా ప్లాన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది కస్టమర్స్ ఎక్కువ వాలిడిటీని కోరుకుంటే... మరికొందరు ఎక్కువ డేటా ఉండే ప్లాన్స్ వైపు మొగ్గుచూపుతారు. ఎయిర్‌టెల్, జియో,వొడాఫోన్ ఐడియా (వీఐ).. ఈ మూడింటిలో ఎక్కువ వాలిడిటీతో పాటు ఎక్కువ డేటా అందించే ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్‌టెల్, జియో,వొడాఫోన్ ఐడియా 3జీబీ డేటా ప్లాన్స్ :


జియో రూ. 601 ప్లాన్‌లో 28 రోజుల వాలిడిటీతో డైలీ 3జీబీ డేటాను అందిస్తోంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. 6జీబీ అదనపు డేటా కూడా పొందుతారు. దీని ద్వారా ఏడాది పాటు డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ వెర్షన్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. 


వొడాఫోన్ ఐడియా (వీఐ) రూ. 601 ప్లాన్‌తో 28 రోజుల వాలిడిటీతో రోజుకు 3GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 16 జీబీ అదనపు డేటా పొందుతారు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఓటీటీ వార్షిక సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. 


ఎయిర్‌టెల్ రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌ వెర్షన్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, వింక్ మ్యూజిక్ ఉచిత ట్రయల్‌ పొందుతారు. ఒకరకంగా జియో, వీఐతో పోలిస్తే ఇది కాస్త తక్కువ ధరలో అందుబాటులో ఉంది.


జియో, ఎయిర్‌టెల్, వీఐ 84 రోజుల ప్లాన్స్:


జియోలో రోజుకు 2జీబీ డేటా అందించే రెండు దీర్ఘకాలిక ప్లాన్స్ ఉన్నాయి. రూ. 719 ప్లాన్‌తో 84 రోజుల వాలిడిటీతో రోజుకు 2GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. జియో యాప్స్‌కి యాక్సెస్ పొందుతారు. రూ. 1,066 ప్లాన్‌తోనూ ఇవే బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ యాక్సెస్‌ పొందుతారు. 5జీబీ అదనపు డేటా పొందుతారు.


ఎయిర్‌టెల్ అందించే రూ.839 ప్లాన్‌తో  84 రోజుల వాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు,  అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఫ్రీ ట్రయల్ పొందుతారు.


వీఐ కూడా 84 రోజుల వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ ధర రూ. 459. దీని ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 6జీబీ డేటా పొందుతారు. వీఐ మూవీస్‌తో పాటు టీవీ అప్లికేషన్స్‌కి యాక్సెస్ పొందుతారు.


Also Read: PM Ujjwala Yojana: పీఎం ఉజ్వల యోజన స్కీమ్ సూపర్ సక్సెస్... ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి..


Also Read: Corona Fourth Wave: దేశంలో పెరుగుతున్న కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఏప్రిల్ 27న సమీక్ష


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.